సూపర్ మార్కెట్ నిర్లక్ష్యానికి చిన్నారి బలి.!
నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది
ఆర్మూర్ నియోజకవర్గం నందిపేట్ మండల కేంద్రంలో ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ లో నవీపేట్ కు చెందిన చిన్నారి కరెంట్ షాక్ తో మరణించింది.. సోమవారం నిజమాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఎన్ మార్ట్ సూపర్ సరుకులకు తండ్రితో కలసి రిషిత వెళ్ళింది అక్రమంలో రిషిత చాక్లెట్స్ కోసం సూపర్ మార్కెట్లో గల ఫ్రిడ్జ్ డోర్ కు తీయడంతో ఒక్కసారిగా కరెంట్ షాక్ తగలడంతో పక్కనే ఉన్న తండ్రి పక్కకు లాగినప్పటికీ ఆ చిన్నారి సృహ కోల్పోయింది. వెంటనే జిల్లా కేంద్ర ఆస్పత్రిలో తరలించారు. అప్పటికే మృతి వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు, గ్రామస్తులు ధర్నా రాస్తారోకో చేపట్టారు. నందిపేట్ మండల కేంద్రంలో కనీస సౌకర్యాలు ప్రజల రక్షణకు చర్యలు తీసుకోకుండా ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ ను నిర్వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సూపర్ మార్కెట్ నిర్వాహకుల అలసత్వం వల్లే చిన్నారి బలైందని, చిన్నారి మృతికి కారణమైన ఎన్ మార్ట్ సూపర్ మార్కెట్ నిర్వాహకుల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.