మరో కొత్త జిల్లా కోసం ఉద్యమం.!
– మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జిల్లాగా ప్రకటించాలి..
హుజురాబాద్ యదార్థవాది ప్రతినిది
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజవర్గం సైదాపూర్ మండల కేంద్రంలోని అఖిలపక్ష పార్టీలు జేఏసీ ఆధ్వర్యంలో హుజురాబాద్ ను మాజీ ప్రధాని పీవీ జిల్లాగా ప్రకటించాలని జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం భారీ రాలి నిర్వహించి నిరసన తెలిపారు.. అనంతరం అఖిలపక్ష నాయకులు జేఏసీ నాయకులు మాట్లాడుతూ 13 మండలాలను కలుపుకొని హుజురాబాద్ ను పివీ జిల్లాగా వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. సైదాపూర్, భీమదేవరపల్లి, చిగురుమామిడి, ఎలకతుర్తి, కమలాపూర్, జమ్మికుంట, ఇల్లంతకుంట, వీణవంక, కేశపట్నం వివిధ మండలాలను కలుపుకొని వెంటనే హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించాలి అన్నారు. ఈనెల 15న హుస్నాబాద్ లో జరగబోయే భారీ బహిరంగ సభకు తరలి వెళ్లి సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం హుజరాబాద్ ను జిల్లాగా మార్చడంలో ఎందుకు ఇంత చిన్నచూపు చూస్తుందని, అధికార పార్టీ జిల్లాను ఏర్పాటు చేయడంలో విఫలం అయిందని 2016 సంవత్సరంలో జిల్లాలు విభజన చేయడంలో 31 జిల్లాలను ఏర్పాటు చేయడంలో అప్పుడే హుజరాబాద్ జిల్లాగా ప్రకటిస్తే బాగుండేదని భౌగోళికగా చారిత్రక హుజురాబాద్ జిల్లాగా ఏర్పాటు చేయవలసి ఉన్నప్పటికీ కూడా 2018 సంవత్సరంలో ములుగు నారాయణరావుపేట జిల్లాలుగా ప్రకటించినప్పటికీ కూడా హుజరాబాద్ ను విస్మరించడం జరిగిందని తెలిపారు. నాటి నుండి నేటి వరకు కూడా ర్యాలీ రూపంలో ధర్నా రూపంలో నిరసనలు చేయడం జరుగుతుందని అవసరం లేని ప్రాంతాలను కూడా జిల్లాలుగా కెసిఆర్ చేశరని, తెలుగు ముందు బిడ్డ మన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో హుజురాబాద్ ప్రకటించాలన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో పివి జిల్లాగా వెంటనే ప్రకటించాలి. కార్యక్రమంలో వర్దినేని రవీందర్ రావు, పొడిచెట్టి వెంకటరాజ్యం. ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి, గుండారపు శ్రీనివాస్, కొండ గణేష్, జంపాల సంతోష్ కందుల శ్రీనివాస్ రెడ్డి, కూతురు విధ్వాన్ రెడ్డి, కామిని వీరేశం, రాయిచెట్టి చంద్రయ్య, కాయిత రాములు, గాదర్ల ఓదెలు, యాదగిరి ప్రజా ప్రతినిధులు వివిధ గ్రామల కుల సంఘాలు ప్రజలు పాల్గొన్నారు.