మార్చి 28న యాదాద్రి ఆలయ పున
ప్రారంభం
– జీయర్ స్వామి సూచన మేరకు ముహూర్తం ఖరారు
– 125 కిలోల బంగారం తో స్వర్ణ
తాపడం
– 1008 మంది రుత్వికులచే మహా కుంభ సుదర్శన యాగం
సీఎం కేసీఆర్
వచ్చే ఏడాది మార్చి 28న జీయర్ స్వామి నిర్ణయించిన మేరకు యాదాద్రి ఆలయ పున ప్రారంభించడానికి నిర్ణయించినట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఆయన మంగళవారం యాదాద్రి లో మీడియా సమావేశంలో మాట్లాడారు. మహా కుంభ సంప్రోక్షణ
నిర్వహించడానికి విద్వత్ సభ నిర్వహించినట్లు చెప్పారు. మహా కుంభ సుదర్శన యాగం ఒక వెయ్యి ఎనిమిది మంది రిత్విక్ లచే జరపనున్నట్లు తెలిపారు. మూడు జలాశయాల నీరు కలిసే చోట యాదాద్రి పుణ్యక్షేత్రం గొప్ప సాంస్కృతిక ఆధ్యాత్మిక శోభకు కు నిలయంగా మారనుందని చెప్పారు. రాష్ట్రపతులు, ప్రధాన మంత్రులు, ముఖ్యమంత్రులు, మంత్రులు తదితర పెద్దలు వస్తే బస చేసేందుకు ప్రత్యేక సూట్లు ఏర్పాటు చేశామన్నారు. వెయ్యి ఎకరాలలో గెస్ట్ హౌస్ లు, ధర్మశాలల నిర్మాణానికి ఏర్పాటు చేశామన్నారు. దేశంలోని ప్రముఖ ఆగమ వాస్తు పండితులనందరిని విచారించి ఈ కార్యక్రమాన్ని ని చేపట్టడం జరిగిందని అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వలె యాదాద్రి ఆలయానికి విమానం గోపురం నిర్మించడానికి125 కిలోల బంగారు స్వర్ణ తపడం చేయించడానికి నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మాకుటుంబం నుండే ఒక కిలో లో 16 తులాల బంగారం ఇవ్వనున్నట్లు తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కిలో, ఆయన నియోజకవర్గంలో నుండి మరో కిలో, జీయర్ పీఠం నుండి కిలో, కావేరి సీడ్స్ కిలో, బంగారం ఇవ్వనున్నట్టు తెలిపారు. యాదాద్రికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే బంగారాన్ని ఆర్బీఐ నుండి కొనుగోలు చేస్తుందని తెలిపారు. ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని, నియోజకవర్గాన్ని , ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వామ్యం చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. యాదాద్రి క్షేత్రం మాది అని భావన కలగడానికి 12769 గ్రామ పంచాయతీలను, 3609 మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పోరేషన్లు భాగస్వామ్యులను చేస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రమని నేను ఎప్పుడు చెప్తుంటాను అని అదే ముమ్మాటికి నిజం అని అన్నారు. ఈ సమావేశంలో స్పీకర్ గుత్తా సుఖేందర్రెడ్డి, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి , జగదీశ్ రెడ్డి, గొంగిడి సునీత తదితరులు పాల్గొన్నారు.