ఆంధ్ర ప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి :నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం

323

తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, నేతలపై దాడులను ఖండిస్తున్నామని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. చిలకలూరిపేటలో మంగళవారం రోజున మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం,పట్టాభి ఇంటి పై వందలాది మంది రౌడీలు గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసు శాఖ,డిజిపి వైఫల్యం, నిఘా వైఫల్యం వల్లే ఇటువంటివి జరిగాయని చెప్పారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇటువంటివి ప్రోత్సహిస్తే ప్రజల్లో భయాందోళనకు జగన్మోహన్ రెడ్డి కారణం అవుతారని తెలిపారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి