జర్నలిస్టుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తా.
ఏపి ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ.
విజయవాడ యదార్థవాది ప్రతినిది
మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చే ఏకైక ముఖ్యమంత్రి సీఎం జగన్ అని, జర్నలిస్టులకు కూడా ఇళ్ళ స్థలాలు కేటాయించడం గొప్ప నిర్ణయం తీసుకుందని, ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు సినీ నటుడు అలీ స్పష్టం అన్నారు. శనివారం విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్ లో తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు అధ్వర్యంలో సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా అలీ ని కలిశారు. జర్నలిస్టులకు ఇళ్ళ స్థలాలు విషయంలో అయన కృషిని ప్రశంసిస్తూ ఘనంగా సన్మానించి సంఘం మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా అలీ తో సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ దాదాపు రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టులకు సొంత ఇల్లు అనేది చిరకాలవాంఛగా మిగిలిపోయిందని జర్నలిస్టులకు 3 సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుని మంత్రివర్గ సమావేశంలో ఆమోదించడం వెనువెంటనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం శుభపరిణామం. ఇది నిజంగా జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసుకోవడానికి తొలిమెట్టు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల కుటుంబాల్లో వెలుగు నింపారు. సగటు జర్నలిస్టుల జీవన పరిస్థితులను మెరుగుపర్చేందుకు ఇది ఎంతగానో ఉపకరిస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. సుమారు 20ఏళ్ళుగా జర్నలిజంలో ఉంటూ నేటికి సెంటు ఇంటిస్థలం దక్కించుకోలేని జర్నలిస్టు లు ఎంతోమంది ఉన్నారు. కరోనా కాలంలో పత్రికలు ఛానల్స్ ని వీడిపోయి బ్రతికి ఉంటే చాలనుకుని కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన జర్నలిస్టులు నేడు ప్రభుత్వం ఇస్తానని చెబుతున్న ఇళ్ళ స్థలాల కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు వీరి ఆశలపై ప్రభుత్వం నీళ్ళు చల్లే ప్రయత్నం కాకుండా మరోసారి నిబంధనలపై పునరాలోచన చేయాలనికోరారు. ప్రభుత్వం పెట్టిన 5ఏళ్ళ అక్రిడేషన్ నిబంధన ను స్వాగతిస్తునప్పటికీ అన్ని అర్హతలు ఉండి వివిధ కారణాలతో ప్రస్తుతం అక్రిడేషన్ పొందలేనివారిని గత అనుభవాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని వారికి న్యాయం చేయాలన్నారు. వంశపారంపర్యంగా వచ్చే కుటుంబ ఆస్తిని జర్నలిస్టులకు ముడిపెట్టడం సరికాదని, గతంలో ప్రభుత్వం నుండి పొందిఉంటే వారిని మినహాయించి మిగతా అందరికీ మూడు సెంట్లు ఇళ్ళ స్థలం ఇవ్వాలని కోరారు. జగనన్న కాలనీలో ఒకవేళ తీసుకుని ఉంటే వారికి నచ్చినది ఎంపిక చేసుకునే వెసులుబాటు ఇవ్వాలని, లేదంటే సగం మంది కూడా అర్హులు ఉండరని వివరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చెవుల శ్రీనివాస రావు అవినాష్ బోడపాటి సుబ్బారావు పిల్లి యజ్ఞ నారాయణ, కాలేషావలి సాంబశివరావు విజయ్ తానంకి సురేష్ తదితరులు పాల్గొన్నారు.