మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణే: మంత్రి హరీష్
సిద్దిపేట యదార్థవాది జిల్లా ప్రతినిది
సిద్దిపేట జిల్లా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులని మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతుల ప్రాణాలు కాపాడాలని ఉద్దేశంతో వ్యవసాయ బావుల దగ్గర మోటర్లకు మీటర్లు బిగించని ఏకైక ప్రభుత్వం బి ఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ అని ఆయన అన్నారు బుధవారం సిద్దిపేటలోనీ శివనుభవ మండపంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హరీష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ సర్కారు మోటార్లకు మీటర్లు పెట్టాలని తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి చేసిందని మీటర్లు పెట్టకపోతే రాష్ట్రానికి రావాల్సిన నిధులకు కోత పెడుతామని బెదిరించిందని అయినా మోటార్లకు మీటర్లు పెట్టేది లేదని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారని వివరించారు. దేశంలో మోటార్లకు మీటర్లు పెట్టని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మోటార్లకు మీటర్లు పెట్టనందుకు గత ఐదేళ్లలో రాష్ట్రానికి రావాల్సిన నిధుల్లో రూ.25 వేల కోట్ల నష్టం చేసింది బీజేపీ అన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలతో నిజమేదో అబద్ధమేదో తేలిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వాలు కూడా మోటార్లకు మీటర్లు పెడుతున్నయని నిర్మలా సీతారామన్ చెప్పారన్నారు కేసీఆర్ రైతుల పక్షపాతి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల్లో కూడా మోటార్లకు మీటర్లు పెట్టారని, ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా రాష్ట్రంలో రైతుల మోటార్లకు మీటర్లు పెడుతారని పొరపాటున కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ఓటు వేయవద్దని చెప్పారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల ఉద్యోగులకు మొదటి తారీకున జీతాలు పడకపోవడం వాస్తవమని ఇది కేంద్ర ప్రభుత్వం వైఖరి వల్ల జరిగిందని గత ప్రభుత్వాలు ఉద్యోగులను అనేక రకాల ఇబ్బందులకు గురిచేసి గుర్రాలతో తొక్కించిన పరిస్థితులను ఉద్యోగులు గమనించాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక రెండుసార్లు పి అర్ సి ఇచ్చింది 9 ఎండలో 133% జీతాలు పెంచినది ఎంప్లాయిస్ పెండ్లి ప్రభుత్వం కేసీఆర్ అని అన్నారు ఉపాధ్యాయ ఉద్యోగులు చిరుద్యోగులు ప్రజలు రైతులు టిఆర్ఎస్ ప్రభుత్వంనీ దీవించాలన్నారు.