అష్టాదశ శక్తి పీఠ సహిత ఉమా రామలింగేశ్వర ప్రతిష్టోత్సవాలు.
కొండపాక యదార్థవాది
హైదరాబాదు నుండి 80 కిలోమీటర్లు ఇటు సిద్దిపేటకు 20 కిలోమీటర్ల దూరంలో కొమరవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి అతి సమీపాన రాజీవ్ రహదారి పక్కన తెలంగాణలో సిద్దిపేట జిల్లా కొండపాక గ్రామ పరిసరాల్లో కొమురవెల్లి గ్రామ పరిసర ప్రాంతం గొప్ప ఆధ్యాత్మికత తో పాటు ఆలయ ప్రాంగణముగా విరసిల్లబోతుంది. ఇంతవరకు 18 శక్తి పీఠాలు ఒకే ఆలయ ప్రాంగణంలో యావత్ భారత దేశంలోనే ఎక్కడ లేవు కానీ ఇప్పుడు ఆ 18 అమ్మవార్ల రూపంలో ఉన్న శక్తి పీఠాలు కొండపాక పరిసర ప్రాంతంలో కొలువుదీరనున్నాయి. మాజీ ఐఏఎస్ కె.వి రమణాచారి ప్రోచహంతో ఈ గొప్ప సంకల్పం నెరవేరనున్నది దీనిలో భాగంగా శనివారం ఉదయం గో పూజ తో మోదైలన కార్యక్రమాలు గురు వందనం లో శ్రీ పుష్పగిరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ విద్యా శంకర భారతి స్వామి వారు రాజగోపురం ద్వారా పూజాదిక్రాలు చేస్తూ ఆలయ ప్రవేశం చేసారు తదుపరి అనుగ్రహ భాషణం గావించి తర్వాత యజ్ఞప్రవేశం ప్రవేశము నవగ్రహ వాస్తు కలశ స్థాపనం చండీ పారాయణం చేసాక శ్రీ మాధవానంద సరస్వతి స్వామి, పీఠాధిపతులు తదితరులు పూజా కార్యక్రమం లో పాల్గొని ప్రసాదావితరణ గావించారు. అనంతరం శాస్త్రోక్తంగా వార్ల విగ్రహాలు జలాధివాసం చేసారు. దీనిలో భాగంగా ఆదివారం గురు వందనము ప్రాతః కాల పూజలు మూల మంత్ర జపములు చండీ పారాయణము వేద పారాయణము అష్టాదశ శక్తి పీఠాల అనుస్టానములు గణపతి మంటప దేవత హోమాములు సాయంత్రం నాలుగు గంటలకు తదితర పూజా కార్యక్రమాల అనంతరం తీర్థ ప్రసాదాల వితరణ జరుగును.