సెలెబ్రెటీలకు స్పెషల్ ఏమి లేదు -అందరిలాగే మీ కేసు కూడా -పరువు నష్టం కేసు వేసిన సమంత తరపు న్యాయవాది కి స్పష్టం చేసిన న్యాయమూర్తి

311

సెలెబ్రెటీలకు స్పెషల్ ఏమి లేదు
-అందరిలాగే మీ కేసు కూడా
-పరువు నష్టం కేసు వేసిన సమంత తరపు న్యాయవాది కి స్పష్టం చేసిన న్యాయమూర్తి

సినీ నటులు నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపై మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. అయితే ఎక్కువగా సమంత మీదనే కథనాలు వెలువడ్డాయి. ఇంకొందరు ఏకంగా సమంతకు
ఫ్యాషన్ డిజైనర్ స్టైలిష్ ప్రీతం జుకల్కర్కు
మధ్య రిలేషన్ నే అంట కట్టారు. సంథింగ్ సంథింగ్ ఉన్నదని దారుణంగా రూమర్స్ క్రియేట్ చేశారు.
అయితే ఇలా తన మీద తప్పుడు వార్త రాసిన వారిపై సమంత చర్యలకు దిగుతోంది తనపై పై వాక్యాలు చేసిన యూట్యూబ్ ఛానల్లాపై కూకట్పల్లి కోర్టులో కేసు ఫైల్ చేశారు. అయితే సమంత తరపు న్యాయవాది కేసును త్వరగా విచారణ చేపట్టాలని కూకట్పల్లి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ముందు అందరూ సమానమే అని సెలబ్రెటీలకు ప్రత్యేకంగా ప్రాధాన్యత ఏదీ ఉండదని సమయం వచ్చినప్పుడే విచారిస్తామని న్యాయమూర్తి తెలిపారు. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ప్రచారం చేసిన మీడియా పత్రికల యూట్యూబ్ ఛానల్లా వారు క్షమాపణలు చెప్పేలా చూడాలని సమంత కోరారు. పరువు నష్టం ఎంత అనేది తర్వాత కోరుతానని వెల్లడించారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి