ప్రజా పాలన తో సమస్యలు పరిష్కారం
* రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు 6 గ్యారంటీలకు అర్హులే..
* ప్రతి మండలానికి ఇంటర్ నేషనల్ స్కూల్ కోరకు స్థల సేకరణ చేపట్టాలి..
* ప్రభుత్వ భూముల వివరాలు సేకరణ చేయాలి..
* జిల్లా అదనపు కలెక్టర్ రమేష్..
మెదక్ యదార్థవాది ప్రతినిధి
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం అదనపు జిల్లా కలెక్టర్ రమేష్ ఈ నెల 28 నుంచి ప్రారంభం కాబోయే ప్రజా పాలన కార్యక్రమము పై అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా పాలనతో ప్రజల సమస్యలు పరిష్కారం దొరుకుతుందని జిల్లా యంత్రాంగం ప్రజా పాలన నిర్వహణ కు సిద్దంగా ఉందన్నారని ప్రజలు ప్రజా పాలనను ఉపయోగించుకొని సమస్యలు పరిష్కారిoచుకోవలని ప్రజా పాలన దరఖాస్తు ఎలాంటి రుసుము లేదని ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయనున్నామని ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులు స్వీకరించాలని రేషన్ కార్డు కలిగి వున్నా ప్రతి ఒక్కరు 6 గ్యారంటీలకు అర్హులేనని తెలిపారు. మెదక్ జిల్లాలో ప్రతి మండలము లో ఇంటర్ నేషనల్ స్కూల్ ఏర్పాటు కోసం 10 ఎకరాల స్టల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. అమరవీరులకుటుంబాలు 250 గజాల ఇంటి స్థలం కొరకు దరఖాస్తు చేసుకోవాలని ప్రజాపాలనలో వచ్చిన ధరఖాస్తులన్నీ ఆన్లైన్ చేస్తామని అన్నారు.