ప్రజలకు సంక్షేమం ఫలాలు అందించడమే కాంగ్రెస్ లక్ష్యం: మంత్రి పొన్నం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు దరఖాస్తు చేసుకునేలా ప్రతి కుటుంబానికి దరఖాస్తు ఫారాలను ప్రభుత్వమే అందిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ప్రజా పాలన కార్యక్రమం పై నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నేల28 నుండి జనవరి 6 వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పులు కాదు సంపద సృష్టించామని స్వేద పత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ నాయకులు ముందు కల్వకుంట్ల కుటుంబ ఆస్తులపై సౌధ పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ దారులకు ప్రతి నెల ఒకటవ తేదీ నుండి ఐదో తేది లోపు జీతాలు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కాంగ్రెస్ కార్యకర్తలకు సమావేశంలో కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి శివయ్య కేడం లింగమూర్తి కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ రవీందర్ కౌన్సిలర్ భూక్య సరోజన మంజులా రెడ్డి వల్లపు రాజు ఎండి హసన్, మైదం శెట్టి వీరన్న పెరుమాండ్ల నర్సాగౌడ్ బంక చందు వెన్న రాజు రజిత జైపాల్ రెడ్డి ఎంపీపీ గీకు రవీందర్ తదితరులు పాల్గొన్నారు.