ఘనంగా నర్సారెడ్డి జన్మదిన వేడుకలు
కొండపాక యదార్థవాది
మండల పరిధిలోని దుద్దెడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎండి నూరుద్దీన్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షులు తూముకుంట నర్సారెడ్డి జన్మదినం సందర్భంగా స్వయంభూ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శివాలయం ప్రాంగణం ఆవరణలో కేకు కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తదని ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ప్రజల దగ్గరికే వెళ్లి దరఖాస్తులు స్వీకరిస్తు అర్హత ఉన్నవారందరికి పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని అన్నారు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కాకుండా ఉంటే బాగుండని బీఆర్‌ఎస్ అనుకుంటోంది. తొమ్మిదేళ్లలో ఒక్కరికి కూడా రేషన్‌కార్డు ఇవ్వని ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిది. పేదలకు పంచిన భూములను గత ప్రభుత్వం లాక్కుంది. ప్రజా పాలన దరఖాస్తులకు సంబంధించి ప్రతీ ఊరిలో కౌంటర్ ఉంది జనవరి ఆరో తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారని ప్రజలందరూ వినియోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు పంజా అఖిల్ బుడలా రాజు బూరుగుల రాజు, గాజులపాటి కార్తీక్, మిద్దె సురేష్, పంజా కుమార్ గాజులపాటి రాజు బూర్గుల కనకరావు మగ్ధుం కుసుoబ సతీష్ చిట్యాల నర్సిములు బూరుగుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.