రాష్ట్రాన్ని దోచుకునేందుకే ఆ మూడు పార్టీలు ఆరాట పడుతున్నాయి: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి.

285

హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి , రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్ఆర్ వ్యవస్థాపకురాలు షర్మిలపై విమర్శలు చేశారు. శనివారం ఆయన మీడియా తో మాట్లాడుతూ.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వనరులను దోచుకునేందుకు వీరు ముగ్గురు ముందుకు వచ్చారని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశం లేక హైదరాబాద్ , తెలంగాణపై పెత్తనం చెలాయించాలనే ఆలోచనతో వైఎస్ షర్మిల ఇక్కడ పార్టీ పెట్టారని అన్నారు . తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్వలేక వీరు ముగ్గురు సీఎం కేసీఆర్ ను నిందిచడమే పనిగా పెట్టుకున్నారని అన్నారు. హుజురాబాద్ లో ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదని, ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన ఉపఎన్నికలో విపక్షాలకు పరాభవం తప్పదని జోస్యం చెప్పారు . టీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయం సాధించడం ఖాయమని అన్నారు.

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి