జాతీయ స్థాయి క్రికెట్ పోటీలకు సిద్దిపేట వాసి ఎంపిక.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
67వ జాతీయ స్థాయి పాఠశాలల క్రికెట్ పోటీలకు రోళ్ల ఋత్విక్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SGFI) కు ఎంపికైనట్లు హైదరాబాద్ జిల్లా కార్యదర్శి సోమశేఖర్ హైదరాబాద్ జిల్లా అండర్ -17 క్రికెట్ కోచ్ ప్రదీప్ తెలిపారు. సిద్దిపేట కు చెందిన ఋత్విక్ రోళ్ల గత డిసెంబర్‌లో గద్వాలలో హైదరాబాద్ జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా హైదరాబాద్ జిల్లా కెప్టెన్ గా వ్యవహారించాడు టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఋత్విక్ ఈ నెల 16 నుంచి 23 వరకు బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరగనున్న అండర్ -17 జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహించనున్నాడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఋత్విక్ ను సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారులు అభినందించారు.