స్వచ్ఛ పట్టణంగా హుస్నాబాద్.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిధి:
హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ -2023 లో భాగంగా భారతదేశంలోని అన్ని పట్టణాలతో పోటీ పడగా దక్షిణ భారతదేశంలోని పదిహేను వేల నుండి ఇరువైఅయిదు వేల లోపు జనాభా గల పట్టణాల్లో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపాలిటీ “స్వచ్ఛ పట్టణం” 3 వ స్థానం ఎంపిక కావడం పట్ల రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ మున్సిపాలిటీ స్వచ్ఛ సర్వేక్షన్ లో మూడోసారి ఎంపిక కావడం గమనర్హం అని మంత్రి కొనియాడారు. స్వచ్ఛ సర్వేక్షన్ లో స్వచ్ఛ పట్టణంగా ఎంపిక కావడంలో భాగస్వామ్యం అయిన మున్సిపల్ చైర్ పర్సన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు కో అప్షన్ సభ్యులు అధికారులను మంత్రి అభినందిస్తూ భవిష్యత్ లో హుస్నాబాద్ మున్సిపాలిటీ మరెన్నో అవార్డులు సాధించాలని రాష్ట్రస్థాయిలో పేరు రావాలని ఆకాంక్షించారు.