విజేతలకు బహుమతులు ప్రధానం
గజ్వేల్ యాదర్తవాది ప్రతినిధి
కొండపాక మండల పరిధిలోని వెలికట్ట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ గూడ మల్లారెడ్డి ద్వితీయ వర్ధంతి సందర్బంగా అయన కుటుంబ సభ్యులు ఉమ్మడి వెలికట్ట గ్రామనికి చెందిన క్రీడాకారులతో మొన్న క్రికెట్ పోటీ శనివారం మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించి విజేతలకు ఆదివారం గ్రామ పంచాయితీ వద్ద బహుమతులు అందజేశారు. దీనిలో భాగంగా క్రికెట్ లో మెరుగు భాను టీం కు మొదటి బహుమతి రవీందర్ నగర్ మూడోజు సాయి తేజ టీం కు ద్వితీయ బహుమతి వెలికట్ట వారియర్స్ టీం కు తృతీయ అందజేశారు. ముగ్గుల పోటీలో గెలిచిన దొబ్బ నవనీత కు మొదటి బహుమతి శివానికి రెండో బహుమతి ఎర్రబోయిన అశ్వినికి తృతీయ బహుమతి అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమం లో మల్లారెడ్డి భార్య సరోజనమ్మ కుమారులు నరేందర్ రెడ్డి మహేందర్ రెడ్డి లు మాట్లాడుతూ మనం ఎంత పెద్ద స్థాయికి ఎదిగినా పుట్టినరో ఊరును కన్నవాళ్ళను మరిచిపోవద్దని ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నాగాని ఎన్ని దేశాలు తిరుగుతున్నాగాని పుట్టి పెరిగిన గడ్డను గుర్తు చేసుకుంటూ సమాజానికి తనవంతు సహాయం చేస్తూ ముందుకు సాగలానే ఉద్దేశం తోనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాని అన్నారు. మా నాన్న మాకు ఇంత తొందరగా దూరం అవడం బాధగా ఉన్నా ఆయన ఆశయ సాధనలో భాగంగా మాకు సాధ్యమైనంతవరకు ఇతరులకు ఏదో ఒకరకముగా ప్రోత్సహిస్తూ సహాయ సహకారులు అందించాలనే ఉద్దేశం తో ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించామని ఇలాంటి మరెన్నో సేవలు చేయడానికి మా తండ్రి నేర్పిన బాటలో మేము సిద్ధంగా ఉన్నామన్నాడు ఇలాంటి సేవా కార్యక్రమాలు మాకు నిరంతర ప్రక్రియ అంటూ ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటామన్నారు. ఈ క్రీడా పోటీలు ఇంత బాగా జరగడానికి ఎంతో కృషి చేసిన ఆర్గనైజర్లు విజ్జగిరి ప్రభాకర్ దొబ్బ రాజు లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు కార్యక్రమనికి హాజరు అయినా వక్తలు మాట్లాడుతూ మల్లారెడ్డి సర్ గ్రామానికి చేసిన సహాయ సహకారులు గుర్తు చేసుకుంటూ గ్రామ ప్రజలకే కాదు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి ఏదో ఒకరకముగా మంచి విషయాలు చెప్తూ జీవితం లో ఎలా ముందుకు వెళ్ళాలి అనే సూచనలు ఇస్తుండేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో వెలికట్ట సర్పంచ్ అమ్ముల రమేష్, పాక్స్ డైరెక్టర్ బూర్గుల సురేందర్ రావు , ఎంపిటిసి చింతల సాయి బాబా,రవీందర్ నగర్ విశ్వనాథ పల్లి సర్పంచ్ వాసరి లింగారావు వార్డ్ మెంబర్లు స్వప్న పురుషోత్తం పటేల్ కోడెల గిరి రేషన్ డీలర్ బాపూరావు చకినాల శ్యామ్ కుమార్ నాంపల్లి యాదగిరి వెలికట్ట ప్రధానో ప్రదానోపాధ్యాడు జగన్నాదరెడ్డి స్కూల్ యజమాన్య కమిటీ ఛైర్మెన్ రాజు సిపిఎం బాలనర్సయ్య పెరుగు స్వామి పెరుగు అంజయ్య కొమురయ్య మహమ్మద్ ప్రభాస్ వంశీ ఏఎన్ఎం నాగమణి ప్రజలు పాల్గొన్నారు