పదిలో ప్రథమ స్థానం లో ఉందాం: ఎమ్మెల్యే హరీష్
సిద్దిపేట నియోజకవర్గంలో వంద శాతం ఫలితాలు సాదించేల సమిష్టి కృషి చేద్దం.
తల్లితండ్రులు మనోదైర్యంన్ని.. విద్యార్థులకు ఇవ్వాలి.
పడి మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడు బాధ్యత తీసుకోవాలి.
సిద్దిపేట యదార్థవాది ప్రతినిధి
సిద్దిపేట నియోజకవర్గంలో పది ఫలితాల్లో ప్రథమ స్థానం లో నిలిచేల కల్సి కట్టుగా పని చేయాలి అని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు మంగళవారం నియోజకవర్గం విద్యాధికారులు ప్రభుత్వ పాఠశాలలు ప్రధానోపాధ్యాయులు మోడల్ స్కూల్స్ కస్తూర్బ రెసిడెన్షియల్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ లతో టేలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న పది పరీక్ష ఫలితాల్లో గత స్ఫూర్తి కొనసాగించి సిద్దిపేట నియోజకవర్గం పదవ తరగతి ఫలితాల్లో నూరు శాతం ఫలితాలు వచ్చే విధంగా సమిష్టి కృషి చేయాలి ఎప్పటిలాగా పదవ తరగతి పరీక్ష ఫలితాల ఫై ద్రుష్టి పెట్టాలని సూచించారు. సిద్దిపేటకు ఉన్న ప్రతిష్టను కొనసాగింపుగా ఇప్పటికే సెలబస్ పూర్తి అయి ప్రత్యేక తరగతులు మొదలు కావచ్చని ప్రభుత్వ పాఠశాల లు అంటే పెద పిల్లలు ఎక్కువ గా ఉంటారు ఈ సమయం లో విద్యార్థిని విద్యార్థులకు ఆత్మవిశ్వాసం నింపాలన్నారు. నేటి నుంచే పది ఫలితాల ఫై ప్రణాళిక తయారు చేసుకోని ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. ఈ రోజు నుంచి రెండు నెలలు తల్లితండ్రులు మనోదైర్యంన్ని పిల్లలకు ఇవ్వాలన్నారు. పది మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయులు భాధ్యత తీసుకొవలి త్వరలో ఉపాధ్యాయుల విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతానని అన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యా శాఖ నోడల్ అధికారి రామస్వామి ఎం ఈ వో లు శ్రీనివాస్ రెడ్డి యాదవ రెడ్డి దేశి రెడ్డి లు ఉన్నారు.