రైతులకు సాగునీరు విడుదల
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
అనంతసాగర్ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ లోకి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 18, 19, 20 తేదీలలో అనంతసాగర్ రిజర్వాయర్ నుండి రంగనాయక సాగర్ లోకి ఒక టీఎంసీ నీటిని పంపింగ్ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. రంగనాయక సాగర్ రిజర్వాయర్ లోకి పంపింగ్ చేసిన నీటిని యాసంగి పంట కాలానికి రైతులు పంట నష్టపోకుండా పంటలు పండించుకునేందుకు ఈనెల 20న రంగనాయక సాగర్ నుండి కాల్వల ద్వారా చెరువులకు పంట పొలాలకు సాగునీరు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పత్రిక ప్రకటనలో తెలిపారు.