సమస్యల సాధన కొరకై చలో హైదరాబాద్
నిజామాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: ఆశా వర్కర్లు తాము ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ఈనెల 10న చలో హైదరాబాద్ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నూర్జహాన్ మాట్లాడుతూ ఉదయం నుండి సాయంత్రం వరకు రెస్టు లేకుండా అనేక కార్యక్రమాల్లో ఆశా వర్కర్లు పాల్గొంటున్నారని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తమవంతుగా సేవలు అందిస్తున్నారని వాళ్ళు చేసే సేవకు తగిన ఫలితం దక్కకపోవడం బాధాకరమని ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి. అసెంబ్లీ సమావేశంలో చర్చించి ఆశ వర్కర్లకు తగిన న్యాయం చేసి తీర్మానం చేయాలని నూర్జహాన్ పిలుపునిచ్చారు.