దివ్యాంగుల సమస్యలపై ప్రత్యేక దృష్టి
-రేపు సమీకృత కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం ప్రత్యేక ప్రజావాణి ప్రారంభం
-మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: జిల్లాలో ఉన్న దివ్యాంగుల కొరకు ప్రతినెల రెండవ మంగళవారం ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణిపై ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు దివ్యాంగుల కొరకు ప్రత్యేక ప్రజావాణి ఏర్పాటు చేస్తామని ఇచ్చిన మాటపై కట్టుబడి ఉండి వెంటనే ప్రజావాణిపై అధికారులతో సంప్రదించి నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు.. ప్రతినెల రెండో మంగళవారం ప్రజావాణి ఏర్పాటు చేయాలని సంబంధిత గ్రామీణ అభివృద్ధి, జిల్లా స్త్రీ శిశు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ,సమన్వయంతో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రత్యేక ప్రజావాణి ఉంటుందన్నారు. సంబంధిత సంక్షేమ శాఖ అధికారి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ దివ్యాంగుల ప్రత్యేక ప్రజావాణికి జిల్లా స్త్రీ శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ, జిల్లా గ్రామీణ అభివృద్ధి, ఎల్ డి ఎం, ఆర్టీసీ డిఎం, మెప్మా పీడీ సంబంధిత శాఖల అధికారులు హాజరుకావాలని కలెక్టర్ సందర్భంగా ఆదేశించారు..