20.7 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణజిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపారవేత్తలుగా చేద్దాం 

జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపారవేత్తలుగా చేద్దాం 

జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపారవేత్తలుగా చేద్దాం 

-సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి 

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: 

సిద్దిపేట జిల్లా రైతులకు వ్యవసాయం ద్వారా ఆదాయ పెంపుదల, వ్యవస్థాపక మార్కెట్ అనుసంధానాలలో సహాయం అందించి జిల్లాలో వ్యవసాయ ముఖచిత్రాన్ని మార్చి రైతులను వ్యాపార వేత్తలుగా మార్చేందుకు కృషికల్ప ఫౌండేషన్ కృషి చేస్తుందని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి పేర్కొన్నారు. సోమవారం ఐడిఓసి లోని సమావేశ మందిరంలో వ్యవసాయ, ఉద్యాన శాఖ సంయుక్తంగా క్రిషికల్ప జిల్లా యంత్రాంగం సహకారంతో  కలెక్టరేట్ లో నిర్వహించిన “అగ్రిసినర్జీ 2024” కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి ముఖ్య అతిధిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన 20+ అగ్రిటెక్ స్టార్టప్‌ల ప్రదర్శన తిలకించారు. రైతులు, ఎఫ్‌పిఓ సీఈవోలు, డైరెక్టర్లు, విద్యార్థులతో సంభాశించారు. నూతన వ్యవసాయ, ఉద్యాన పరిష్కారాల ప్రత్యక్ష ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, విజయ గాథలు మరియు మార్కెట్ లింకేజీ మార్గదర్శనల పై చర్చించి రైతులకు ఎఫ్ పీఓ ల ద్వారా మార్కెటింగ్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను సరైన ధరకు అమ్ముకునేందుకు ఎఫ్పిఓ(ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ )ల ద్వారా కృషికల్ప ఫౌండేషన్ సహకరిస్తుందని అన్నారు. ఎఫ్ పిఓ ల ద్వారా ఫెస్టిసైడ్లను అందించి వాటి  వినియోగం మార్కెట్ లో ఎక్కవ డిమాండ్ ఉన్న పంటలను ప్రోత్సహించి ఎక్కువ దిగుబడినిచ్చే పంటలు, సాగుబడిలో అధునాతన సాంకేతిక పద్ధతుల వినియోగం తదితర అంశాలపై సంపూర్ణ అవగాహన కల్పించి రైతులను వారి ఉత్పత్తులను అమ్ముకోవడంలో వ్యాపారవేత్తలుగా మార్చడానికి కృషికల్ప ఫౌండేషన్ ద్వారా కృషి జరుగుతుందని అన్నారు. జిల్లాలోని అక్కన్నపేట మండలంలో ప్రహర్ష, ప్రసిద్ధ ఎఫ్ పిఓ ల ద్వారా ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నదని అన్నారు. ఇలాంటి అదునాతన పద్దతులు జిల్లాలోని రైతులకు ప్రయోజనకరంగా నిలుస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఆదర్శ రైతులు, ఎఫ్ పిఓలు, విద్యార్థులు ఇలాంటి వాటిపై స్పష్టమైన అవగాహనను పెంపొందించుకోవాలని అన్నారు. దాంతో పాటు రైతులు ఆసక్తిని కనబరిచి బృందంగా ఏర్పడి ఎఫ్.పి.ఓ. లుగా ఏర్పడాలని ఎఫ్ పిఓ ల కొరకు జిల్లాలోని వంటిమామిడి వ్యవసాయ ఉత్పత్తుల కలెక్షన్ సెంటర్ ఏర్పాటుకు కృషికల్ప ఫౌండేషన్ పరిశీలించాలని,  జిల్లాలో గల ప్రహర్ష, ప్రసిద్ధ ఎఫ్.పి.ఓ.ల ద్వారా సేకరించిన వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి సుముఖంగా ఉన్న  ఇలా అగ్రి కంపెనీతో ఎం.ఓ.యు.లను కుదిర్చారు. అనంతరం వివిధ సంస్థలు రైతులకు అందించే అవకాశాలను గురించి వివరించాయి. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి రాధిక, ఉద్యానవన శాఖ అధికారి సువర్ణ, కృషికల్ప ఫౌండేషన్ సిఈఓ సిఎం.పాటిల్, నాబార్డ్ డిడియం నిఖిల్, వ్యవసాయశాఖ అధికారులు, రైతులు వ్యవసాయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్