మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయాలి
-టీయూడబ్ల్యూజె జిల్లా అధ్యక్షులు శంకర్ దయాళ్ చారి
మెదక్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: కవరేజ్ కు వెళ్లిన ఈటీవీ, టీవీ5, టీవీ9, టీవీ ఛానళ్ల ప్రతినిధులపై దాడికి పాల్పడిన మాజీ రాజ్యసభ సభ్యులు, సీనియర్ సినీ నటుడు మంచు మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేసి..తక్షణమే అరెస్ట్ చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజెయూ) జిల్లా అధ్యక్షులు ఎ.శంకర్ దయాళ్ చారి అన్నారు.. బుధవారం మెదక్ కలెక్టరేట్ ముందు నిరసన తెలిపి అదనపు కలెక్టర్ నగేష్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సినియర్ నటుడు మోహన్ బాబు సినిమాలలో చేసిన విలన్ పాత్ర నిజా జితంలో కూడా పాత్రికేయుల మిద మంగళవారం దాడి చేయడం చూశామని, గతంలో సినిమా నటి సాక్షి శివానంద్, సీనియర్ నటి జయంతిలపై మోహన్ బాబు చేసిన దాడులు, పెట్టిన హింసలు ఇప్పటికి అనేక మందికి గుర్తు వున్నాయన్నారు.. ఒక సినిమా నటుడుగా, నిర్మాతగా, డైరెక్టర్ గా, రాజకీయ వేత్తగా, విద్యా సంస్థల నిర్వాహకుడిగా, రియల్ ఎస్టేట్ ఓనర్ గా, నిజజీవితంలో ఎన్ని పాత్రలు వేసినా తన క్రిమినల్ బుద్ధిని ఏనాడు వదిలి పెట్ట లేదని అన్నారు. నిజాలను భరించే శక్తిలేక టీ.వీ.9 ప్రతినిధిపై నటుడు మోహన్ బాబు వీరావేశంగా దాడి చేయడం అర్థం అవుతుందన్నారు. మోహన్ బాబుపై హత్యా యత్నం కేసు నమోదు చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదని తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. సంతోష్ కుమార్, జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, ఐజెయూ మాజీ సభ్యులు ఫరూక్ హుస్సేన్, నాయకులు మురళీధర్ గుప్తా, శ్రీధర్,గోవర్ధన్ రెడ్డి, అల్లాడి శేఖర్, శ్రీనివాస్, ఆంజనేయులు, కృష్ణమూర్తి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.