30.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణజర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన.. విరాహత్ అలీ

జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన.. విరాహత్ అలీ

జర్నలిస్ట్ రంజిత్ ను పరామర్శించిన.. విరాహత్ అలీ

హైదరాబాద్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:

సినీ నటుడు మోహన్ బాబు చేసిన దాడిలో తలకు బలమైన గాయం తగిలి, సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీ.వి 9 జర్నలిస్ట్ రంజిత్ ను గురువారం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షులు కె.విరాహత్ అలీ పరామర్శించారు. ఈ సందర్బంగా ఆయన రంజిత్ ను పలకరించి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. రంజిత్ తలపై మోహన్ బాబు లోగో బాదడంతో తగిలిన బలమైన గాయం చూసి విరాహత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంఘటనను తమ సంఘం తీవ్రంగా పరిగణిస్తుందని, నిందితుడికి చట్టపరంగా శిక్ష పడేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని భరోసా ఇస్తూ, రంజిత్ కు ఆయన ధైర్యాన్ని అందించారు. విరాహత్ తో పాటు టీయుడబ్ల్యూజే ఉప ప్రధాన కార్యదర్శి కలుకూరి రాములు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ. రాజేష్, హెచ్.యూ.జే అధ్యక్షులు శిగా శంకర్ గౌడ్ లు రంజిత్ ను పరామర్శించారు.

బాధిత జర్నలిస్టుకు మనోధైర్యాన్ని అందించిన టీ. వి9 ప్రతినిధి బృందం

మోహన్ బాబు దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్ ను టీ.వి9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళి కృష్ణ, అవుట్ పుట్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ డియస్ లు పరామర్శించి,  ఆందోళన చెందవద్దని తాము అన్ని విధాలా అండగా ఉంటామని మనో ధైర్యాన్ని అందించారు. పరామర్శించిన వారిలో క్రైం బ్యూరో చీఫ్ విజయ్ సాతా, కో-ఆర్డినేటర్ ధర్మారెడ్డి, క్రైం రిపోర్టర్ ప్రణీత తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్