బీసీ గర్జన సభను జయప్రదం చేయండి
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: వరంగల్ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న జరిగే బిసి గర్జన సభను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసి ఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో బుధవారం ఆయన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం పై ఉన్న బీసీలు రాజకీయ, ఆర్థిక, విద్యాపరంగా, సిని రంగంలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని తక్కువ శాతం అగ్ర కులాలు పెత్తనం చెలాయిస్తూ బీసీ ఓట్లను పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన కానీ వెనుకబడిన వర్గాల జీవితంలో మార్పు లేదని అగ్రకుల పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యుసి రిజర్వేషన్ ను వర్తింపజేయడం వలన బీసీ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం లో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చిందని పూర్తిస్థాయిలో ఏ ఒక్క హామీను కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. బీసీ ప్రధాని ఉండి కూడా బీసీలను కు న్యాయం జరగడం లేదని వాపోయారు. బీసీలను ద్రోహం చేస్తున్న పార్టీల వైఖరిని ఎండగట్టి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా చైతన్యం తీసుకొస్తామని చెప్పారు. బీసీ మహా గర్జనకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ మేధావులు, బీసీ సంఘాల నాయకులు హాజరవుతున్నారని పార్టీలకతీతంగా బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగస్వామి, చాంద్ పాషా, వల్లాల సైదులు, ఆవుల అంజయ్య యాదవ్, గండమల్ల వెంకన్న, మామిడి శోభన్, జానకీరాములు, వల్లాల బుచ్చయ్య, సుమన్, విజయ్, కోటేష్, బూర కిరణ్, తదితరులు పాల్గొన్నారు