34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ బ్లాగ్

బీసీ గర్జన సభను  జయప్రదం చేయండి

బీసీ గర్జన సభను  జయప్రదం చేయండి

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: వరంగల్ లోని ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఫిబ్రవరి 2న జరిగే బిసి గర్జన సభను జయప్రదం చేయాలని ఉమ్మడి నల్లగొండ జిల్లా డిసి ఎంఎస్ మాజీ చైర్మన్ వట్టే జానయ్య యాదవ్ పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాంధీ నగర్ లో బుధవారం ఆయన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 60 శాతం పై ఉన్న బీసీలు  రాజకీయ, ఆర్థిక, విద్యాపరంగా, సిని రంగంలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని తక్కువ శాతం అగ్ర కులాలు పెత్తనం చెలాయిస్తూ బీసీ ఓట్లను పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. స్వాతంత్రం వచ్చి ఏడు దశాబ్దాలు గడిచిన కానీ వెనుకబడిన వర్గాల జీవితంలో మార్పు లేదని అగ్రకుల పేద విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యుసి రిజర్వేషన్ ను  వర్తింపజేయడం వలన బీసీ విద్యార్థులు అన్యాయానికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం లో రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక వాగ్దానాలు ఇచ్చిందని పూర్తిస్థాయిలో ఏ ఒక్క హామీను కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ప్రజలను మభ్యపెడుతుందని విమర్శించారు. బీసీ ప్రధాని ఉండి కూడా బీసీలను కు న్యాయం జరగడం లేదని వాపోయారు. బీసీలను ద్రోహం చేస్తున్న పార్టీల వైఖరిని ఎండగట్టి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా చైతన్యం తీసుకొస్తామని  చెప్పారు. బీసీ మహా గర్జనకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, బీసీ మేధావులు, బీసీ సంఘాల నాయకులు హాజరవుతున్నారని పార్టీలకతీతంగా బీసీలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లింగస్వామి, చాంద్ పాషా, వల్లాల సైదులు, ఆవుల అంజయ్య యాదవ్, గండమల్ల వెంకన్న, మామిడి శోభన్, జానకీరాములు, వల్లాల బుచ్చయ్య, సుమన్, విజయ్, కోటేష్, బూర కిరణ్, తదితరులు పాల్గొన్నారు

ప్రేమ వివాహమె హత్యకు కారణం

ప్రేమ వివాహమె హత్యకు కారణం

-పథకం ప్రకారమే కృష్ణ హత్య,

-ఆరుగురు నేరస్తుల అరెస్టు

-ఎస్పీ సన్ ప్రీత్ సింగ్

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: కుల దురహంకారంతో పథకం ప్రకారo వడ్లకొండ కృష్ణ ను హత్య చేసిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్య కేసుపై బుధవారం స్థానిక యస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ వివరాలు వెల్లడించారు. హత్యకు గురైన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి  కృష్ణ, పిల్లలమర్రి గ్రామానికి చెందిన కోట్ల నవీన్ ల మద్య ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. దీంతో కృష్ణ తరచూ నవిన్ ఇంటికి వెళ్ళేవాడు. ఈ క్రమములో నవీన్ చెల్లెలు భార్గవి, బంటి ప్రేమించుకున్నారు. భార్గవి కుటుంబ సబ్యులు వీరి ప్రేమను అంగీకరించలేదు. దీంతో ఇరువురు కుటుంబ సబ్యులకు తెలియకుండా  వివాహము చేసుకున్నారు. ఇది భార్గవి కుటుంబ సభ్యులకు ఇష్టం లేదు.దీంతో వారు కృష్ణను అంతం చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.ఇందులో భాగంగా తాళ్లగడ్డకు చెందిన బైరు మహేశ్ తో పాటు నల్గొండకు చెందిన మరో యువకుడు నువ్వుల సాయి చరణ్  సాయం తీసుకున్నారు. ప్లాన్ లో భాగంగానే కొన్నాళ్లుగా కృష్ణతో నిందితుడు బైరు మహేశ్ స్నేహం చేస్తున్నట్లు నటించాడు. ఈ పథకాన్ని ఈ నెల 19వ తేదీన అమలు చేయాలని చూసినప్పటికీ సాధ్యం కాలేదు. మరోసారి ప్రయత్నించి విఫలం అయ్యారు. ఈ క్రమంలో  ఈ నెల 26 న ఆదివారం రాత్రి హత్యకు పాల్పడ్డారు. ఇందుకు గాను  26 వతేదీ సుమారు 4.40 గంటల సమయములో మహేశ్  అనే నింధితుడు హత్యకు గురైన కృష్ణ కు ఫోన్ చేసి చేసి పని ఉన్నది రమ్మని చెప్పినాడు. బంటి వస్తున్నాను అని చెప్పగానే, పథకం  ప్రకారం మహేశ్ వెంటనే నవీన్ కు ఫోన్ చేసి మేము వస్తున్నం, అలర్ట్ గా ఉండమని చెప్పినాడు. బంటి తన స్కూటి పై మహేశ్ ఇంటి ముందుకు రాగా మహేశ్ బంటి స్కూటి ఎక్కి ఇద్దరు పార్టీకి కావాల్సిన డ్రింక్స్, తినుబండారాలు కొనుక్కొని సూర్యాపేటలోని జనగామ క్రాస్రోడ్డు సమీపం లోని మహేశ్ వ్యవసాయ భూమి వద్ద కు చేరుకున్నారు. మహేశ్ మద్యం తాగగా, కృష్ణ కూల్ డ్రింక్ తాగాడు. ఆ రోజు సాయంత్రం అక్కడ సుమారు 3-4 గంటల సేపు కూర్చున్నారు. మహేశ్ కొద్ది దూరము వెళ్ళి నవీన్ కు ఫోన్ చేసి, నేను బంటి మెడ అందుకోగానే వారిని రమ్మని చెప్పినాడు. ఇంటికి వెళ్లుదామని బంటి స్కూటర్ స్టార్ట్ చేయగా, మహేశ్  స్కూటర్ వెనకాల ఎక్కి కూర్చున్నాడు.బంటి స్కూటర్ కదిలిస్తుండగా మహేశ్ బంటి మెడకు  చుట్టూ చేయి వేసి గొంతు నొక్కి గట్టిగా పట్టుకున్నాడు. అప్పటికే అక్కడ కంప్లచెట్లలో దాక్కున్న  నవీన్,  వంశీలు పరిగెత్తుకుంటూ వచ్చారు.వెంటనే  బంటి కాళ్ళు వంశీ పట్టుకోగా, నవీన్ కూడా బంటి గొంతు పట్టికొని వత్తినాడు. కొట్టి చనిపోయినాడని  నిర్ధారించుకున్న తరువాత నవీన్ తన ఎర్టీగ కారులో ఉన్న ఒక ప్లాస్టిక్ పెద్ద బస్తా లో బంటి శవాన్ని వేసి, తాడుతో మూట కట్టి, కారు వెనుక డిక్కీలో వేశారు. నవీన్, వంశీలు బంటి శవాన్ని పాత సూర్యాపేట లో  బంధువుల ఇంటిలో ఉన్న తమ నాయనమ్మ బుచ్చమ్మ కు చూయించారు.అక్కడి నుంచి  నల్గొండలో ఉన్న  తన ఫ్రెండ్ సాయి చరణ్  వద్దకు వెళ్ళి శవాన్ని చూపెట్టేందుకు కారులో వెళ్లారు.   చరణ్ ను కారు వద్దకు తీసుకొని వచ్చి   బంటి శవము  మూటను చూపించారు.  వెంటనే చరణ్ భయంతో కారు దిగి వెళ్ళినాడు.  అక్కడి నుండి వారు కారులో తిరిగి సూర్యాపేటకు  వెళ్లే దారిలో  పాత సూర్యాపేటకు వెళ్ళి నాయనమ్మ కోట్ల  బుచ్చమ్మను, వంశిని లేపారు. బంటి స్కూటటర్ వంశీ తీసుకొని కారు వెనుక నుండి రాగా మళ్ళీ పిల్లలమర్రి గ్రామ శివారులో గల చెర్వు కట్ట చివరలో మూసి కెనాల్ ప్రక్కన బంటి మృతదేహాని పడేశారు.అనంతరం వారు అక్కడి నుండి పాత సూర్యాపేటకు వెళ్ళి అక్కడ కోట్ల బుచ్చమ్మ ఉన్న వారి బందువు ఇంట్లో ముగ్గురు పడుకున్నారు. తరువాత అక్కడి నుండి కారులో మహేష్, నవిన్, వంశీలు హైద్రాబాద్ కు వెళ్ళి అక్కడ ఉండి 28 వ తేది రాత్రి పిల్లలమర్రిలోని నవీన్ ఇంటికి రావడం జరిగింది. సమాచారం అందుకొని బుధవారం ఉదయము పోలీస్ లు వారిని అరెస్టు చేశారు. వీరి నుండి హత్యకు ఉపయోగించిన ఎర్టీగా కారు, ఒక కత్తి, 5 సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై ఎస్సి, ఎస్టీ యట్రాసిటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు. నింధితుల గత నేర చరిత్ర ఉంది.ఇందులో కోట్ల నవీన్ సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో నాలుగు పాత  కేసులలో ముద్దాయి గా ఉన్నాడు. అదేవిధంగా  బైరు మహేశ్  టౌన్  పిఎస్ పరిధిలో తొమ్మిది పాత  కేసులలో  ముద్దాయి గా ఉన్నాడు. అదేవిధంగా  టౌన్ పి.యస్ యందు రౌడీ షీట్ వుంది. కోట్ల సైదులు సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో ఒక పాత కేసులో ముద్దాయి గా ఉన్నాడు. కోట్ల వంశి సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో మూడు  పాత  కేసులలో  ముద్దాయి గా ఉన్నాడు.కోట్ల బుచ్చమ్మ కు సూర్యాపేట రూరల్ పిఎస్ పరిధిలో రెండు   పాత  కేసులలో ముద్దాయి గా ఉన్నది. నువ్వుల సాయిచరణ్  నల్లగొండ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక  పాత కేసులో ముద్దాయి గా ఉన్నాడు. ఇక హత్యకు గురైన కృష్ణ పై కూడా 3 కేసులు ఉన్నాయి. కులాంతర వివాహం నేపథ్యంలో ఇరు కుటుంభాలకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగిందని యస్పీ తెలిపారు. అమ్మాయి తరుపు కుటుంబ సబ్యులు మనసులో పెట్టుకుని  ప్లాన్ ప్రకారం హత్యచేశారని పేర్కొన్నారు. సోదరులైన కోట్ల నవీన్, వంశీ లు స్నేహితుడైన బైరు మహేష్ తో కలిసి హత్య కు పాల్పడ్డారని చెప్పారు. అమ్మాయి సోదరులైన కోట్ల నవీన్, వంశీ, తండ్రి సైదులు, నాయనమ్మ బుచ్చమ్మ, స్నేహితుడైన మహేష్, సాయి చరణ్ లను అరెస్ట్ చేయడం జరిగిందని తెలిపారు. హత్యలో  ఇంకా ఎవరైనా ఉంటే దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ  అన్నారు. ఇలాంటి వాటికి ఎవ్వరూ పాల్పడవద్దని ప్రేమ వివాహాలు, కులాంతర వివాహాల చేసుకుంటే పోలీసు వద్దకు రావాలని సూచించారు. ఇబ్బంది పెట్టె వారు ఉంటే పోలీసులకు సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇలాంటి చర్యల వల్ల జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఎస్పి అన్నారు.ఈ సమావేశంలో డిఎస్పీ రవి, సిఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ సిబ్బంది పాల్గొన్నారు.

ఘనంగా వాసవి మాతకు మహా అభిషేకం

ఘనంగా వాసవి మాతకు మహా అభిషేకం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో  శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాలను పురస్కరించుకొని బుధవారం  దేవాలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై శ్రీ వాసవి మాత ఉత్సవ విగ్రహానికి వివిధ రకాల పండ్ల రసాలతో ఘనంగా అభిషేకము నిర్వహించారు చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అభిషేక కార్యక్రమంలో పాల్గొని భక్తిపారవశంతో  కొంతమంది భక్తులు పూనకాలతో ఊగిపోయారు. అంతకుముందు 108 కలశాలతో పంచామృతాలతో పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు వాసవి మాత మాల ధారణ స్వాములు కోలాటాలతో ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించి అభిషేక కార్యక్రమంలో పాల్గొన్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో వాసవి దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మికశోభ సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవాలయ ప్రధాన కార్యదర్శి ఈగ వెంకటేశ్వర్లు, వాసవి మాలాధారణ నిర్వాహకులు పబ్బతి వేణుమాధవ్, కల కోట లక్ష్మయ్య మాట్లాడుతూ నేడు గురువారం సాయంత్రం మూడు గంటలకు వాసవి దేవాలయం నుండి బెంగళూరుకు చెందిన రాండోల్ బృందం తో పాటు, కోలాటాలతో పెద్ద ఎత్తున సూర్యాపేటలో మొట్టమొదటిసారిగా కానీ విని ఎరుగని రీతిలో శోభయాత్ర నిర్వహిస్తున్నట్లు భక్తులు పెద్ద ఎత్తున శోభయాత్రలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలన్నారు. ఈనెల 31న వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక అభిషేకం తో పాటు హోమం, ఒడిబియ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ సభ్యులు, సింగిరి కొండ రవీందర్ ,తోట శ్యాంప్రసాద్, పోలా రాధాకృష్ణ, వెంపటి శబరినాథ్,ఈగ దయాకర్, బిక్కుమల్ల కృష్ణ, నూక రవిశంకర్, మంచాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు

అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు

-లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలి

-ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ, యదార్ధవాది ప్రతినిధి, జనవరి 29: సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన నిర్వహించారని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ప్రశ్నించారు. బుధవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్,ఉపాధి హామీ అధికారులు, సిబ్బందితో ఏర్పాటుచేసిన  సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారుల విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అమలులో ఉన్న ఉపాధి హామీ పథకం నిర్వహణ విషయంలో ఉపాధి హామీ సిబ్బంది తమ విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అదేవిధంగా ఆత్మీయ భరోసా పథకంలో లబ్ధిదారుల ఎంపిక ఏ ప్రాతిపదికన నిర్వహించారంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల పరిషత్ లోని ఖాళీ స్థలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో మంజూరయ్యే ఇంటి నమూనా నిర్మాణం చేపట్టి, 40 రోజుల్లో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నమూనాను చూసి నియోజకవర్గ ప్రజలు ఇందిరమ్మ ఇళ్లపై  అవగాహన పెంచుకుంటారని అన్నారు. పథకాల అమలులో ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా అధికారులు ఎలాంటి తప్పిదాలకు పాల్పడినా చర్యలు తప్పవని హెచ్చరించారు. నిజమైన అర్హులకు పథకాలు లబ్ధి చేకూరేలా అధికారులు పారదర్శకత పాటించాలని కోరారు. సమీక్ష సమావేశంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, మండల పరిషత్ శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

నల్లగొండలో కేటీఆర్ రైతుధర్నా ఒక డ్రామా

నల్లగొండలో కేటీఆర్ రైతుధర్నా ఒక డ్రామా

నల్లగొండ, యాదార్ధవాది ప్రతినిధి, జనవరి 29: నల్లగొండలోని రైతుధర్నాలో కేటీఆర్ దగుల్బాజీ మాటలు మాట్లాడారని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ విమర్శించారు. బుధవారం నల్లగొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాప్ కార్యాలయంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదేళ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించిందని ధ్వజమెత్తారు. కెసిఆర్ గడీల పాలన సాగించాడని, ఏ ఒక్కరికి ఇల్లు నిర్మించి ఇవ్వకుండా మోసం చేసిండని, ప్రాజెక్టుల పేరుతో రాష్ట్రాన్ని తండ్రి, కొడుకులు అందినకాడికి దోచుకున్నారని విమర్శించారు. అధికారం కోల్పోయిన తర్వాత పిచ్చి పట్టినట్లుగా మాట్లాడుతున్నారని, గతంలో ప్రజలు, రైతుల సమస్యల కోసం ధర్నాలు చేస్తే ధర్నా చౌకాను ఎత్తివేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. పది సంవత్సరాల కాలంలో అన్ని ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, దోచుకున్నారని విమర్శించారు. దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా కేటీఆర్ నల్లగొండకు వచ్చి ప్రగల్బాలు పలుకుతున్నాడని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్లగొండలో ఫ్లోరైడ్ సమస్య కోసం పోరాటం చేశాడని, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని సైతం త్యాగం చేశారని, మంత్రులను విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తుందని,  ఇటీవల గ్రామ సభలలో ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిందని అన్నారు. మంత్రిగా ఉన్నప్పుడు జగదీశ్ రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసింది ఏమీ లేదని అన్నారు. పార్టీ కడవలు వేర్వేరుగా కనిపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్, బిజెపి పార్టీలు ఒక్కటేనని, ఇప్పటికైనా కేటీఆర్ ప్రభుత్వాన్ని విమర్శించడం మానుకోవాలని, లేనిపక్షంలో తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడుతూ నల్లగొండలో కేటీఆర్ రైతుధర్నా ఒక డ్రామా నల్లగొండ గడ్డ కోమటిరెడ్డి అడ్డా అని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతలకు సమస్యలు గుర్తుకొస్తున్నాయని, కెసిఆర్ దేవరకొండకు వచ్చినప్పుడు సొరంగం మార్గాన్ని కుర్చీ వేసుకొని పూర్తి చేస్తానని, డిండి ప్రాజెక్టును పూర్తి చేసి దేవరకొండను సస్యశ్యామలం చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేసింది మీరు కాదా అని ప్రశ్నించారు. అదేవిధంగా శివన్నగూడెం ప్రాజెక్టును పూర్తి చేసి ఫ్లోరైడ్ రక్కసి నుంచి విముక్తి చేస్తానని, నాగార్జునసాగర్ ఉప ఎన్నికలలో నెల్లికల్ ఎత్తిపోతల పథకం హామీ ఇచ్చి మోసం చేసిరని, తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల 10 వేల ఎకరాలకు 11 విడతలు ప్లాట్లకు, గుట్టలకు రైతుబంధు ఇచ్చారని తెలిపారు. నల్లగొండ మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నల్లగొండను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇక్కడి ప్రజలను నిలువునా మోసం చేశాడని, నల్లగొండలో రైతు మహా ధర్నా పేరుతో కొత్త డ్రామాకు తెర తీశారని, నల్లగొండలో బీఆర్ఎస్ సంక్షేమ పథకాలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి తప్ప అమలు  చేసిన దాఖలాలు లేవన్నారు. అధికారంలో ఉన్నప్పుడు దొరల పాలన సాగించిన కెసిఆర్, కేటీఆర్ మాటలను ప్రజలు ఇప్పుడు ఎవరు నమ్మడం లేదని అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు జూలకంటి శ్రీనివాస్, ఇబ్రహీం, జూలకంటి సైదిరెడ్డి, పిల్లి రమేష్ యాదవ్, కత్తుల కోటి,వజ్జ రమేష్ యాదవ్, కిన్నెర అంజి , గురిజ వెంకన్న, జానీ యాదవ్, కంచర్లకుంట్ల వెంకటరెడ్డి, గాలి నాగరాజు, కంచర్ల ఆనంద్ రెడ్డి, పెరిక హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

భక్తులతో మమేకమైన ఎమ్మెల్యే  

భక్తులతో మమేకమైన ఎమ్మెల్యే  

-జాతర ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తం చేసినా కొత్త ప్రభాకర్ రెడ్డి

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: సిద్దిపేట జిల్లా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి.. అనంతరం జాతరకు వచ్చిన భక్తులకు అభివాదం చేస్తూ..భక్తులతో ముచ్చటించారు.. అనంతరం వారు మాట్లాడుతూ కేసీఅర్ ప్రభుత్వంలో పది సంవ్సరాలపాటు సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని ప్రసిద్ధి చెందిన  కూడవెల్లి రామలింగేశ్వర జాతరను ఘనంగా నిరహించామని ప్రజా పాలనలో జాతర ఏర్పాట్లు చేయడంతో విఫలమైందని అన్నారు. జాతరకు లక్షలాది ప్రజలు వస్తారని వారికి సరైన సౌకర్యాలు కల్పించడం లో ప్రభుత్వం విఫలం అయ్యింది పోలీస్ శాఖ పూర్తిగా  భద్రత ఏర్పాట్లు చేయలేదని, చిన్న పిల్లలు తప్పిపోయిన, తొక్కిసలాట జరిగిన, ఏదైనా ప్రమాదం జరిగిన ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదన్నారు. సిద్దిపేట పోలిస్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్ జాతరలో ఉండి ఏర్పాట్లు పరిశీలించాలి గాని, సిద్దిపేట లో ఉంటే ఇక్కడ సమస్యలు ఎలా పరిష్కరిస్తారని, ఎంతో ఘనమైన చరత్ర కలిగినా కూడవెల్లి రామలింగేశ్వర స్వామి జాతరలో భక్తుల భద్రత పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి తో వ్యవహారించలేదని అన్నారు. ఎమ్మేల్యే తోపాటు జిల్లా బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

ఘనంగా శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: దుబ్బాక నియోజకవర్గం చేగుంట మండలం కర్నాల్ పల్లి  శ్రీ ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి,  తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్  బక్కి వెంకటయ్య, మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, కర్నాల్ పల్లి ఎల్లమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రేణుకా ఎల్లమ్మ దేవికి ముక్కుపుడక సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు చాలా మహిమాన్వితమైన రోజు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని నదులు, వాగులు లో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి, ఇష్టదైవం ని దర్శించుకొని ప్రార్థనలు చేస్తారని, ఎల్లమ్మ తల్లి దయతో దుబ్బాక నియోజకవర్గం ప్రజలంతా సంతోషంగా సుభిక్షంగా ఉండాలని తల్లిని వెదుకున్నానని తెలిపారు. కూడవేల్లి ప్రాంతంలో కూడా  ఈరోజు భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని, భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి మల్లన్న సాగర్ ద్వారా నీటిని విడుదల చేయించడం జరిగిందన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోని దర్శనాలు చేసుకోవాలని పోలీసు ప్రభుత్వ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్  నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఘనంగా వెంకట్రావుపేట వెంకటేశ్వర స్వామి జాతర

ఘనంగా వెంకట్రావుపేట వెంకటేశ్వర స్వామి జాతర

దుబ్బాక, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: వెంకటేశ్వర స్వామి దయతో ప్రజలంతా పాడి పంటలతో,  ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ నియెజికవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తొగుట మండలంలోని వెంకట్రావుపేట లో జరిగిన వెంకటేశ్వర స్వామి జాతరలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మాఘఅమావాస్య సందర్బంగా ఏటా ఇక్కడ జాతర నిర్వహించడం అనవాయితీగా వస్తుందని, వెంకటేశ్వర స్వామి జాతర కోసం వేలాది మంది భక్తులు తరలి రావడం జరుగుతుందన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు..ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గంధారి లత నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షడు అక్కం స్వామి, మాజీ సర్పంచ్ సీలివెరీ రాంరెడ్డి, వెంకటేషం, తోగుట ప్రెస్ క్లబ్ అధ్యక్షడు సాయి, నాయకులు ఎన్నo భూపాల్ రెడ్డి.పంది రాజు, బెజ్జనబోయిన అనిల్.రాములు గ్రామ పార్టీ అధ్యక్షులు ఒళపు నారాయణ, మండల అధ్యక్షులు ప్రవీణ్,  జంగాపల్లి ఆంజనేయులు, బరేంకల స్వామి, పంది నాగరాజు, కలేపు రాజు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మహమ్మద్ షఫీ, యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అట్టహాసంగా సాగిన సింగరాయ జన జాతర 

అట్టహాసంగా సాగిన సింగరాయ జన జాతర 

హుస్నాబాద్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 29: ప్రసిద్ధి చెందిన ప్రతాపరుద్ర సింగరాయ జాతర సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో కూరెళ్ల తంగేళ్లపల్లి గుండారెడ్డిపల్లి గ్రామాల పసర ప్రాంతాల కొండలలో బుధవారం అట్టహాసంగా జరిగింది. ఈ సంవత్సరం జాతరకు గతం కంటే అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం ప్రత్యేకతను సంతరించుకున్నా డు. ఓరుగల్లును పరిపాలించిన కాకతీయ ప్రతాపరుద్రుడు  మండలంలోని తూర్పు నుండి పడమర దిశగా ప్రవహిస్తున్న మోయతుమ్మెద వాగుపై భారీ చెరువును నిర్మించడానికి స్థలాన్ని పరిశీలించడానికి తన ఆస్థానంలోని సింగరాయడు అనే వాస్తుశిల్పిని పంపించాడు కొండపై పూర్వకాలంలో గుహలో వెలసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించకున్న అనంతరం  సింగరాయ అక్కడి ప్రదేశాల్ని పరిశీలిస్తూ ఎతైన కొండలు దట్టమైన అడవి మధ్యలో  నుండి తూర్పు నుండి పడమర దిశగా ప్రవహించే మోయతుమ్మెద వాగు చూడముచ్చటైన ప్రకృతి అందానికి ముదుడై అక్కడే తపస్సు చేసుకుంటూ ఉండిపోయాడు. అందుకే ఈ  ప్రదేశానికి ఓరుగల్లులు పాలిస్తున్న ప్రతాపరుద్రుని పేరు కలుపుకొని ప్రతాపరుద్ర సింగరాయ జాతర అని ఈ ప్రదేశానికి పేరు వచ్చింది  సింగరాయడి కాలం నుంచే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ప్రతి ఏటా పుష్య బహుళ అమావాస్య (మాఘ అమావాస్య) రోజు జాతర వైభవంగా జరుగుతుంది. పడమర దిశగా నదీ ప్రవాహం ఉన్నందున కొండ కోనల్లో  చెట్ల మధ్యలో నుంచి ఆయుర్వేద వనమూలికలతో ప్రవహిస్తున్న ఈ నదిలో స్నానం చేస్తే శరీర రుగ్మతలు తొలగి ఆరోగ్యంగా ఉంటారని ప్రసిద్ధి, అడవి లో కాలినడక కొండగుహలో కొలువుదీరిన లక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. స్వామిని రాష్ట్రంలోని పలు జిల్లాల నుండే కాక మహారాష్ట్రలోని ముంబయి, షోలాపూర్‌, పూనే, బివాండీ, కర్ణాటక బీదర్‌ ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. ఇక్కడ శాఖాహార వంటలు వంకాయ టమాట చిక్కుడుకాయ చెమట ప్రత్యేకతను సంతరించుకున్నాయి, ఆలయాల్లో జరిగే జాతరలు సాధారణంగా రెండుమూడు రోజులు కొనసాగుతాయి. కానీ సింగరాయ జాతర ఇందుకు భిన్నంగా కేవలం ఒక్కరోజు సూర్యాస్తమయం తర్వాత తరువాత స్వామికి తలనొప్పి వస్తుందని భక్తులు దర్శనం చేసుకోరు. రాత్రి వరకు ఆ ప్రాంతం నుంచి అందరూ వెళ్లిపోతారు. ఆలయ పరిసరాల్లో మద్యం, మాంసం తీసుకోవడం పాపమని భక్తులు నమ్ముతారు. అందుకే జాతరకు వచ్చిన భక్తులు వాగు ఒడ్డున  శాఖాహార వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేస్తారు. కోహెడ మండలం కూరెళ్ల, తంగళ్లపల్లి, బస్వాపూర్‌, గుండారెడ్డిపల్లి గ్రామాల శివార్ల మధ్యలో గుట్టల్లో ఆలయం ఉంటుంది. బస్వాపూర్‌, కూరెళ్ల, తంగళ్లపల్లి, గుండరెడ్డిపల్లి గ్రామాల నుంచి వేర్వేరుగా ఆలయానికి దారులున్నాయి. ఎటునుంచి వచ్చినా రెండు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది. కూరెల్ల గ్రామ పంచాయతీ  తంగళ్ళపల్లి గ్రామపంచాయతీ ల మధ్యన వివాదాలు ఉన్నందున ఈసారి జాతరను ప్రభుత్వమే కొనసాగించింది. లక్ష్మీనరసింహస్వామి వెలసిన గుహను సన్యాసుల మఠంగా పిలుస్తారు. కూరెళ్ల నుంచి స్వామిని దర్శించుకునేందుకు వచ్చేదారిలో ఆంజనేయుడు, కాలబైరవుడి విగ్రహాలు కనిపిస్తాయి. ఆలయం చుట్టుపక్కల ప్రాచీన చరిత్రకు సంబంధించిన అనేక ఆనవాళ్లు లభించాయి. ఆదిమ మానవుడి ఆవాసాల ఆనవాళ్లను పరిశోధకులు గుర్తించారు. బౌద్ద మతానికి సంబంధించిన చతుర్ముఖబ్రహ్మ విగ్రహం, గాజు పరిశ్రమ అవశేషాలు, రాకాసిగూళ్లు బృహత్‌ శిలాయుగపు సమాధులు కనిపిస్తాయి. వీటి ఆధారంగా మోయతుమ్మెద వాగు పరీవాహక ప్రాంతంలో వేల సంవత్సరాలుగా మానవుడు జీవనం సాగించనట్టు చరిత్రకారలు నిర్దారించారని చరిత్ర చెప్తుట్టారు.

తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం డైరీను ఆవిష్కరించిన-ఏపీ డిజిపి 

తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం డైరీను ఆవిష్కరించిన ఏపీ డిజిపి 

మంగళగిరి యదార్థవాది ప్రతినిధి జనవరి 29: తెలుగు జర్నలిస్టుల  సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని  బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యలపై నిత్యం కలం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ, అధికారులతో  సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు.  అనంతరం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు కు సంఘం తరపున వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, సంఘం సభ్యులు బింగి సత్తయ్య, కోయ రామారావు, కె.వి నారాయణ, బోడపాటి సుబ్బారావు, శివశంకర్, సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశారు. 

Recent Post

సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ

0
సిద్దిపేటలో మెగా శాకహార ర్యాలీ సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, జనవరి 24 :  బ్రహ్మర్షి పితామహ పత్రీజీ దివ్య ఆశీస్సులతో పి ఎస్ ఎస్ ఎం సిద్దిపేట ఆధ్వర్యంలో ఈనెల 26 తేదీన ఆదివారం...