మీ భద్రాతే మాకు ముఖ్యం..
మీ భద్రాతే మాకు ముఖ్యం..
విశాఖపట్నం: యదార్థవాది ప్రతినిది
విశాఖపట్నం మల్కాపురం పోలీస్ స్టేషన్ ట్రాపిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తులసీదాస్ స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.. ఈ సంబదర్బంగా మాట్లాడుతూ పెండిగ్ లో ఉన్న చలనాలు కట్టలని,...
అనంతమైన సంపద వున్నా…ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే! సిఎం కెసిఆర్
అనంతమైన సంపద వున్నా...ఈ దౌర్భాగ్యనికి కారణం బీజేపీ, కాంగ్రెస్ లే.! సిఎం కెసిఆర్
ఖమ్మం: యదార్థవాది ప్రతినిది
బిన్నమైన మూడు వాతావరణాలు, కష్టించే మానవ సంపద, కోట్ల ఎకరాల...
లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు
లక్ష్మి నరసింహ స్వామిని దర్శించుకున్న..సీఎంలు
యాదాద్రి: యదార్థవాది ప్రతినిది
లక్ష్మి నరసింహ స్వామీ వారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఢిల్లీ సీఎం కేజ్రివాల్,...
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు రామారావు:
తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలిపిన మహనీయుడు రామారావు:
విశాఖపట్నం: యదార్థవాది ప్రతినిది
తెలుగు జాతిని ప్రపంచం గౌరించేలచేసి వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఖ్యాతి స్వర్గీయ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కే...
ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్
ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్: వారాహికి ప్రత్యేక పూజలు హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రచార రథాన్ని సిద్దం చేసుకన్నారు. ఈ ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని నామకరం చేశారు. ఈవాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అనుష్టువ్ నరసింహ యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని నరసింహస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ విడుదల.
తొలి విడత జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు… రెండో విడత మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6 వరకు సమావేశాలు.ఫిబ్రవరి 14...
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట
*విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని నిరసిస్తూ బోగిమంట* *బోగిమంటల్లో ఒక కట్టె వేసి మోడీ విధానాన్ని తిప్పికొట్టండి* *_ ప్రజలకు ప్రజాసంఘాలు పిలుపు* విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్‌ను మోడీ ప్రభుత్వం అమ్మడాన్ని నిరసిస్తూ శుక్రవారం మద్దిలపాలెం కళాభారతి ఆడిటోరియం జంక్షన్‌లో ప్రజాసంఘాలు బోగిమంట ఏర్పాటు చేసాయి. సిఐటియు, ఐద్వా, డివైఎఫ్‌ఐ, ప్రజానాట్యమండలి, వార్వా, నివాస్, ఎస్.ఎఫ్.ఐ తదితర సంఘాలు, కాలనీ సంఘాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని భోగిమంటలో ఒక్కో కట్టె వేసి సేవ్ స్టీల్‌ప్లాంట్, స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకుందాం, ప్లాంట్ అమ్మకం ఆపాలి, అమ్మేదెవడురా` కొనేదెవడురా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.కె.ఎస్.వి.కుమార్, పబ్లిక్ సెక్టార్ కో ఆర్డినేషన్ కమిటీ కో కన్వీనర్ కె.ఎం.కుమార్ మంగళం మాట్లాడుతూ స్టీల్‌ప్లాంట్‌ను అమ్మేస్తామని మోడీ ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు అవుతోందన్నారు. నాటి నుండి నేటి వరకు స్టీల్‌ప్లాంట్ రక్షణకోసం ప్రజాసంఘాలు, కార్మికసంఘాలు ఐక్యంగా ప్రజలను, కార్మికులను కదిలించి ఉద్యమిస్తున్నారని గుర్తుచేసారు. ఈ ఏడాది ప్రజా ఉద్యమంగా మలిచేందుకు సంక్రాంతికి ముగ్గులు వేసి సేవ్ స్టీల్‌ప్లాంట్ నినాదాలు వ్రాయాలని సిఐటియు పిలుపునిస్తే దానిని ప్రజలు అందిపుచ్చుకున్నారన్నారు. భోగి మంటల్లో కూడా ప్రతి ఇంటి నుండి ఒక కట్టె, పిడక వేసి మోడీ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేయాలని పిలుపునిచ్చారు. భోగిమంటల్లో కట్టెలు వేసి నిరసన తెలపాలన్న ప్రచారం ఇప్పటికే సోషల్‌మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్ళిందన్నారు. స్టీల్‌ప్లాంట్ అమ్మే ప్రతిచర్యను ప్లాంట్ కార్మికులు, విశాఖ ప్రజలు తిప్పికొడుతున్నారని తెలిపారు. ప్లాంట్ అమ్మకపు బాధ్యత బిజెపి ప్రభుత్వం ఆ పార్టీ ఎంపి జివిఎల్ నరసింహరావుకు అప్పగించడంతో విశాఖకు తరుచూ వస్తున్నారన్నారన్నారు. ప్లాంట్ ప్రైవేట్‌పరం అయితే బిజెపిని, ఆ నాయకులను ఉమ్మడి ఆంధ్రరాష్ట్ర ప్రజలు బంగాళాఖాతంలో కలిపేయడం ఖాయమని నాయకులు హెచ్చరించారు. ప్లాంట్ ఉత్పత్తిని తగ్గించి తద్వారా నష్టాలనే భూతాన్ని చూపి అమ్మేసే చర్యలు విశాఖపట్నంలో చెల్లవన్నారు. ఈ చర్యలు ప్రజలు తీవ్రంగా ప్రతిఘటించి స్టీల్‌ప్లాంట్‌ను, ఆంధ్రరాష్ట్రాన్ని కాపాడుకుంటారని స్పష్టం చేసారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పి.మణి, ఎ.సీతాలక్ష్మి, పి.వెంకటరావు, జె.ఆర్.నాయుడు, శ్రీను, వరలక్ష్మి, ఐద్వా నాయకులు కె.కుమారి, లలిత, డివైఎఫ్‌ఐ నాయకులు తులసీ, కె.జె.రావు శివ, వార్వా, పెన్షనర్స్ నాయకులు వి.తులసీరాం, చలపతి, త్రినాదరావు, దేముడు, అప్పారావు, ప్రదీప్, పిఎన్‌ఎం నాయకులు ఎం.చంటి, పివి రమణ తదితరులు పాల్గొన్నారు.
ఏసిబి వలలో బహదూర్ పుర యస్ ఐ
స్థానికుల వివరాల ప్రకారం సదరు యస్ ఐ గతంలో కూడా ఎంతో మంది వద్ద డబ్బులు తీసుకున్నట్టు సమాచారం.ఇలాంటి వారి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ కు చెడ్డపేరు వస్తుందని కావున తక్షణమే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఇలాంటి వారిని వెతికి పట్టుకొని చట్ట పరిధిలో కటినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రజలు కోరుతున్నారు.
రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం
*_రూ. 30ఇవ్వాలని డిమాండ్ చేసిన డెలివరీ బాయ్.._* *_రూ. లక్ష చెల్లించాలన్న వినియోగదారుల ఫోరం_* *_రూ. 30 ఇవ్వనందుకు గ్యాస్ డెలివరీ బాయ్ సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిన ఘటనలో వినియోగదారుల ఫోరం కీలక తీర్పు చెప్పింది. వినియోగదారుడికి లక్ష రూపాయల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. అనంతపురంలో జరిగిందీ ఘటన. బాధిత వినియోగదారుడికి స్థానిక గుత్తిరోడ్డులోని హనుమాన్ ఏజెన్సీలో హెచ్‌పీ గ్యాస్ కనెక్షన్ ఉంది. 7 అక్టోబరు 2019లో రీఫిల్ సిలిండర్ బుక్ చేశాడు. సిలిండర్ తీసుకొచ్చిన డెలివరీ బాయ్ అదనంగా రూ. 30 ఇవ్వాలని కోరాడు. అందుకు వినియోగదారుడు నిరాకరించడంతో తెచ్చిన సిలిండర్‌ను వెనక్కి తీసుకెళ్లిపోయాడు._* *_దీంతో వినియోగదారుడు పౌరసరఫరాల అధికారికి ఫిర్యాదు చేయడంతో డెలివరీ బాయ్ తిరిగి సిలిండర్‌ను తీసుకొచ్చి ఇంటిముందు పెట్టి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఘటనను ఆయన ఏజెన్సీ దృష్టికి తీసుకెళ్లాడు. వారు దీనిని లైట్‌గా తీసుకున్నారు. సరఫరా ఖర్చులు ఉంటాయని, వాటిని ఇవ్వాల్సిందేనంటూ డెలివరీ బాయ్‌ను సమర్థించారు. అంతేకాక, వినియోగదారుడిని ఆ తర్వాతి నెలలో మరో ఏజెన్సీకి బదిలీ చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన వినియోగదారుడు ఈ విషయమై కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత జిల్లా వినియోగదారుల ఫోరాన్ని కూడా ఆశ్రయించారు. సిలిండర్‌ను సరైన సమయంలో డెలివరీ చేయకపోవడం వల్ల తాను ఎదుర్కొన్న ఇబ్బందులను ఫోరం దృష్టికి తీసుకెళ్లాడు. స్పందించిన ఫోరం గ్యాస్ ఏజెన్సీకి, ఏపీ పౌర సరఫరాల సంస్థకు నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టింది. అయితే, డెలివరీ బాయ్‌ను తొలగించామని, కాబట్టి పరిహారం చెల్లించాల్సిన పనిలేదని ఏజెన్సీ వాదించింది. వాదనలు విన్న ఫోరం వినియోగదారుడికి జరిగిన నష్టానికి గాను పరిహారం చెల్లించాల్సిందేనని తీర్పు చెప్పింది._*
కనుమరుగైన సంప్రదాయాలు
కనుమరుగైన సంప్రదాయాలు
సిద్దిపేట: 13 యదార్థవాది ప్రతినిది
* మరీనా సంక్రాంతి సంబరం..
* అడునికతతో అంతరించి పోతున్న పండగలు..
మారుతున్న కాలంలో సంస్కృతి, సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి.. సంక్రాంతి అనగానే మూడురోజుల సబరలతో ప్రజలందరూ జరుపుకునే సంతోషకరమైన...

















