అప్పుడే పుట్టిన పాపకు ప్రాణాలు కాపాడిన 108 సిబ్బంది
మెదక్, యదార్థవాది ప్రతినిధి, జనవరి 18 : వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటు వచ్చింది..శనివారం మెదక్ మాత స్త్రీ శిశు సంక్షేమ హాస్పిటల్ లో అప్పుడే పుట్టిన పాపకు 108 సిబ్బంది సిపిఆర్ చేసి కాపాడున ఘటన మెదక్ జిల్లా పట్టణంలో చోటుచేసుకుంది. మెదక్ ప్రభుత్వ ఆసుపత్రిలో అప్పుడే పుట్టిన పాప ఊపిరి ఆడక ఇబ్బంది పడుతుండగా డాక్టర్ల హైదరాబాద్ కు 108 వాహనంలో నిలోఫర్ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఇదే క్రమంలో మార్గమధ్యలో గుండె ఆగిపోవడంతో స్పందించిన అంబులెన్స్ టెక్నీషియన్ రాజు పాపకు సిపిఆర్ చేసి కాపాడాడు. అనంతరం హైదరాబాద్ ఆస్పత్రిలో చేర్పించడంతో పాప ఆరోగ్యంగా ఉందని డాక్టర్లు తెలిపారు. పైలట్ నవీన్, రాజు లను వైద్య సిబ్బoదిని జిల్లా అధికారులు అభినందించారు.