18.7 C
Hyderabad
Sunday, January 25, 2026
హోమ్ఆంధ్రప్రదేశ్అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్‌

అర్ధ రూపాయికి ఓటు అమ్ముకుంటే.. దేహీ అనాల్సి వస్తుంది: పవన్‌

యధార్థవాది ప్రతినిధి మంగళగిరి:

బీసీలు రాజ్యాధికారం అర్థించటం కాదు.. సాధించుకోవాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీసీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని బీసీ కులాలు కలిస్తే రాజ్యాధికారం ఇంకెవరికీ దక్కదన్నారు. ఇన్నేళ్లుగా బీసీల సమైక్యత ఎందుకు సాధ్యం కాలేదో అర్థం కావట్లేదన్నారు. గతంలో 93 ఉన్న బీసీ కులాలు ఇప్పుడు 140కి ఎందుకు పెరిగాయని ప్రశ్నించారు.
”భారాస పార్టీ ఏపీకి వస్తే జనసేన ఆహ్వానించింది. తెలంగాణలో 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడంపై భారాస స్పందించాలి. అన్యాయంపై భారాస వివరణ ఇవ్వాలి. బీసీ కులాల తొలగింపుపై వైకాపా, తెదేపా స్పందించాలి. బీసీలకు జనసేన అండగా ఉంటుంది. చట్టసభల్లో సంఖ్యా బలం లేని బీసీలకు ఏం చేయగలం అనే దానిపై ఆలోచిస్తా. మీ ఓట్లే మీకు పడవు అని బీసీలను హేళన చేస్తున్నారు. బీసీ అభ్యర్థిని నిలబెట్టినప్పుడు అందరూ ఏకతాటిపైకి రావాలి. నన్ను ఒక కులానికి పరిమితం చేసి బీసీ నాయకులతో తిట్టిస్తున్నారు. నన్ను బీసీలతో తిట్టిస్తే రెండు వర్గాల వారు గ్రామస్థాయిలో ఘర్షణకు దిగుతారు. నేను ఒక కులానికి మాత్రమే నాయకుడిని కాదు. ప్రజలందరికీ నాయకుడిగా ఉండాలనుకుంటున్నా” అని పవన్‌ కల్యాణ్‌ తెలిపారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్