అష్టాదశ శక్తిపీఠ కేంద్రంలో ఘనంగా మండల పూజోత్సవాలు
కొండపాక యదార్థవాది
కొండపాక శివారులో గల అష్టాదశ శక్తిపీఠ శ్రీ ఉమా రామలింగేశ్వర సహిత సుబ్రమణ్య స్వామి ఆలయ ధ్వజ శిఖర మహోత్సవములు జరుగుతున్నాయి శనివారం మొదలైన పూజ కార్యక్రమాలు శ్రీశ్రీశ్రీ పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ అభినఉద్ధాండ విద్యా శంకర భారతి స్వామి వారు శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి పీఠము శ్రీ మాధవానంద సరస్వతి ఉభయుల సంపూర్ణ అనుగ్రహం చేత ట్రస్ట్ చైర్మన్ కెవి రమణ చారి ఆధ్వర్యంలో స్వస్తిశ్రీ చాంద్రమాన శోభకృత నామ సంవత్సర మార్గశిర మాసము బహుల దశమి మరియు ఏకాదశి శనివారం నిమిషములకు దీపారాధన గోపూజ గణపతి పూజ పుణ్యవచనం మాతృక దీక్షాధారణ అఖండ దీపస్తాపనము చండీ పారాయణం కలశస్థాపనములు దేవతా పూజలు అష్టోత్తర దేవత ఆవాహనములు హారతి మంత్రపుష్పం తీర్థప్రసాద వినియోగములు జరిగాయి. తదుపరి ఆదివారం ఉదయం రుద్రహోమం పంచసూక్త హోమములు మూల మంత్ర హోమములు బలిహరణ పూర్ణాహుతి స్వామి వారి ఎదుర్కోలు తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కళ్యాణం మహోత్సవములు జరపబడతాయని తెలిపారు. అనంతరం కళ్యాణ మహోత్సవ ఆశీర్వాదములు అన్నసమారాధన తీర్థప్రసాదాల వితరణ గావించబడునని ఇట్టి కార్యక్రమానికి భక్త మహాశయులు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని దేవత అనుగ్రహం పొందగలరని ట్రస్ట్ ఫౌండర్ కమిటీ సభ్యులు తెలిపారు