ఆంధ్ర రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లోనే 38 వేల 896 కరోనా పరీక్షలు నిర్వహించగా 391 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా ఎనభై రెండు కేసులు కొత్తగా నమోదు కాగా, కృష్ణా జిల్లాల 61, తూర్పుగోదావరి జిల్లాలో 57 విశాఖ జిల్లాలో 43 కేసులు కొత్తగా నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు