34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..

ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాం..

-ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్.

దౌల్తాబాద్ యదార్థవాది

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంతోపాటు నిరుపేదల పక్షాన ఎస్ఆర్ ఫౌండేషన్ నిలబడి వారికి మనోధైర్యాన్ని కల్పిస్తుందని ఎస్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ అన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండలం చెట్ల నర్సంపల్లి గ్రామంలో విద్యుత్ షాక్ తో మృతి చెందిన బాలుడు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్సహాయస్థితిలో ఉండే నిరుపేద ప్రజలకు భరోసా కల్పించడానికి సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ స్థాపించడం జరిగిందని పేర్కొన్నారు. చెట్ల నర్సంపల్లి గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన పసుల రేణుక-స్వామి దంపతులకు కూతురు మధుప్రియ, కుమారుడు వినయ్ ఇద్దరు పిల్లలు ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన వర్షం పడడంతో ఇంటి దగ్గర విద్యుత్ వైర్లు తెగిపడి బాలుడు విద్యుత్ షాక్ గురై మృతి చెందడం చాలా బాధాకరమన్నారు.పిల్లలను పెంచి పెద్ద చేసి ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రులను పోషిస్తారని ఎన్నో కలలు కన్న తల్లిదండ్రుల ఆశలు నిరాశలై అర్ధాంతరంగా కుమారుడు మృతి చెందడం విషాదకరం. ఇలాంటి కడుపుకోత ఏ తల్లిదండ్రులకు రాకూడదని, తల్లిదండ్రుల రోదనలు అక్కడ ఉన్న వారందరికి కంటనీరు తెప్పిస్తున్నాయన్నారు. ఎస్ఆర్ ఫౌండేషన్ వారికి భరోసా కల్పించడానికి ఆర్థిక సహాయం చేయడం జరిగిందని ఇంకా మానవతాహృదయులు ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ ఫౌండేషన్ కోశాధికారి మహమ్మద్ ఉమర్, ప్రధాన కార్యదర్శి పుట్ట రాజు, గ్రామస్తులు వేమ శ్రీనివాస్, పసి నర్సింలు తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్