34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణ"ఆరోగ్య మహిళా" పై ప్రతీ మహిళకు అవగాహన

“ఆరోగ్య మహిళా” పై ప్రతీ మహిళకు అవగాహన

“ఆరోగ్య మహిళా” పై ప్రతీ మహిళకు అవగాహన

* ఏఎన్ఎం లు ఆన్ లైన్ డేటా ఎంట్రీ పకడ్బందీగా చేయాలి

* తంగళ్ళపల్లి నేరెళ్ళ ఆరోగ్య మహిళా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

యదార్థవాది ప్రతినిది సిరిసిల్ల

ఆరోగ్య మహిళా కార్యక్రమం యొక్క ఉద్దేశ్యం, ఆవశ్యకత గురించి ప్రతీ మహిళకు అవగాహన కల్పించాలని, ఇందులో ఏఎన్ఎం లు, ఆశా కార్యకర్తలు ప్రధాన పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం తంగళ్ళపల్లి నేరెళ్ళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. రిజిస్ట్రేషన్ ఆన్ లైన్ డాటా ఎంట్రీ నిర్ధారణ పరీక్షల తీరును పరిశీలించి మహిళలు ఆనారోగ్యానికి గురి కావొద్దన్నారు. కార్యక్రమంలో భాగంగా ప్రతీ మంగళవారం ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు పోషకాహార లోపం, బ్రెస్ట్ క్యాన్సర్, గర్భసంచి ముఖద్వార క్యాన్సర్, తదితర వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇవ్వడంతో పాటు, అవసరమైతే జిల్లా ఆసుపత్రికి పంపించి చికిత్స అందించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 4 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీఎస్ నగర్, తంగళ్ళపల్లి, నేరెళ్ళ, వేములవాడ) ఆరోగ్య మహిళా కార్యక్రమం ప్రతీ మంగళవారం నిర్వహిస్తున్నామని అన్నారు. ఎనిమిది టెస్టులను అందరికీ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. పరీక్షల వివరాలను ఆన్ లైన్ లో పకడ్బందీగా ఎంట్రీ చేయాలని ఏఎన్ఎం లను ఆదేశించారు. నిర్ధారణ పరీక్షల్లో ఎవరికైనా వ్యాధి ఉన్నట్లు తెలిస్తే, మెరుగైన చికిత్స కోసం వారిని జిల్లా ఆసుపత్రికి పంపించాలని అన్నారు. వారు ఆసుపత్రికి వెళ్ళి చికిత్స తీసుకున్నారా లేదా అనే విషయాన్ని సంబంధిత ఆశా ఏఎన్ఎం లు పర్యవేక్షించాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని తమ పరిధిలోని మహిళలందరూ వినియోగించుకునేలా సంబంధిత ఆశా ఏఎన్ఎం లు క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ తనిఖీలో జిల్లా కలెక్టర్ వెంట ఉప వైద్యాధికారులు డా.శ్రీరాములు డా.రజిత మెడికల్ ఆఫీసర్లు డా.స్నేహ డా.రేఖ ఏఎన్ఎం లు సూపర్వైజర్లు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్