ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను పరిశీలించిన
సిద్దిపేట యదార్థవాది
తెలంగాణ అవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పనులను క్షేత్ర స్థాయిలో బుధవారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జూన్-2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి జిల్లా కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మైదానంలో స్టేజి, వేడుకలను నలుమూలల తెలిపేలా ప్లేక్సిలు, మైదానంలో ఏల్ మాదిరిగా విఐపి కారిడార్, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, వేడుకలను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులు అందరికి సరిపడే గాలరీ లను నిర్మించాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. అందరికి సరిపడే తాగునీటి వసతి కల్పించాలని స్థానిక తహసిల్దార్ విజయసాగర్ కి తెలిపారు. రంగథాంపల్లి అమరవీరుల స్థూపం వద్ద చుట్టూ కలర్లు వేసి, పూలతో అందంగా ముస్తాబు చెయ్యాలని మునిసిపల్ కమిషనర్ సంపత్ కుమార్ కు తెలిపారు. మైదానంలో పరేడ్, బందోబస్తు, కార్ పార్కింగ్ లాంటి విషయాలను చూసుకోవాలని పోలిస్ అడిషనల్ డిసిపి అడ్మిన్ మహేందర్ కు సుశించారు. ఎలాంటి పోరపాట్లు జరగకుండా అందరి సమన్వయంతో వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా ఏర్పాట్లను చెయ్యాలని అధికారులను ఆదేశించారు.