ఆశ నిరాశ అయిన వేళ మళ్లీ సొంతగూటికి చేరేనా?
ఆశల సౌధం కకావికలం అవగా క్షణిక పాటు నిర్ణయం అంధకారానికి చిక్కేనా?
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
అనుకున్నదొకటి అయినది ఒకటి అన్న చందంగా మారి ఎందుకు వచ్చానా అనుకునే పరిస్థితి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిది తండ్రి కాలం నుండి పదవి కోసం ఎన్న మార్లు పోటీ చేసి విసిగి వేసారి చివరి ప్రయత్నం గా పోటీ చేసి గెలుపొంది పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి చూపించి శభాష్ అనిపించుకున్న మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ ఎంతో మంది అభిమాన గణాన్ని పెంపొందించుకొని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అండగా ఉంటూ అప్పటి ఇందుర్తి నియోజకవర్గ ప్రజలలో చిరస్థాయిగా నిలిచిన బొమ్మ వెంకటేశ్వర్లు, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి అదే దారిలో పయనించి కాంగ్రెస్ పార్టీని వెన్నుదన్నుగా నిలుపుకొని అంకితభావంతో పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ కార్యకర్తలు నాయకులు తో సహకరిస్తూ మార్క్ఫెడ్ చైర్మన్ గా పదవిని చేజెక్కించుకొని పదవికి న్యాయం చేసిన ఘనత ఆయనది అలాంటి బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి బంధువుల ,స్నేహితుల సలహాలేనో లేక కార్యకర్తల ప్రోత్బలమేనో ఎమ్మెల్యే పదవిని ఆశించి భారతీయ జనతా పార్టీ లోనికి మకాం మార్చిన సంగతి తెలిసిందే.ఎన్నో ఒడిదుడుకులకు ఓర్చుకొని అతి కష్టం మీద భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం దక్కించుకున్న నిరాశనే మిగిల్చుకున్నారు మరిప్పుడు అధిష్టానం మేరకు పార్టీ కి కట్టుబడి ఉండడమా లేక సొంతగూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయా అంటూ కార్యకర్తల్లో గుసగుసలు వినిపించడం ప్రత్యేకతను సంతరించుకున్నది ఏది ఏమైనా వేచి చూడాల్సిందే..