ఇంటింటి ప్రచారంలో చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.
నర్సాపూర్ యదార్థవాది ప్రతినిది
ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న నర్సాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆవుల రాజిరెడ్డి తరుపున కాంగ్రెస్ నాయకులు ప్రచారాన్ని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాట్లాడుతూ రాష్ట్రంలో రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రవేశపెట్టే ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజలకు వివరించారు. కెసిఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలు మోసం చేసిందని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ లో చేతి గుర్తుకే ఓటు వేసి గెలిపివ్వాలని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫిషర్మెన్ కార్యదర్శి తలారి మల్లేష్ మాజీ అధ్యక్షుడు నరసింహారెడ్డి సుధాకర్ గౌడ్ జలాల్ పూర్ ఎంపిటిసి భాస్కర్ సీనియర్ నాయకుడు పోతిరెడ్డి గణేష్ శేఖర్ రవితేజ వెంకటరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.