యూట్యూబ్ స్టార్ గంగవ్వ తన చిరకాల స్వప్నాన్ని నిజం చేసుకుంది. సొంత ఇల్లు కట్టుకోవాలన్నా తన కోరిక నెరవేర్చుకుంది. మల్యాల మండలం లంబాడి పల్లిలో కొత్తగా కట్టుకున్న ఇంట్లోకి గృహప్రవేశం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మై విలేజ్ షో పేరుతో సంపాదించిన పేరుతో గంగవ్వ బిగ్బాస్ తెలుగు నాలుగో సీజన్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.