34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

ఈ నెల 24న కొండగట్టుకు పవన్ కళ్యాణ్

వారాహికి ప్రత్యేక పూజలు

హైదరాబాద్: జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఈ నెల 24వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుంటారు. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పవన్ కళ్యాణ్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

వచ్చే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేసేందుకు గాను పవన్ కళ్యాణ్ సిద్దమయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రచార రథాన్ని సిద్దం చేసుకన్నారు. ఈ ఎన్నికల ప్రచార రథానికి వారాహి అని నామకరం చేశారు. ఈవాహనానికి ప్రత్యేక పూజలు చేసిన తర్వాత తెలంగాణ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం కానున్నారు. అనుష్టువ్ నరసింహ యాత్రను చేపట్టాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని నరసింహస్వామి ఆలయాలను పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్