ఈనెల 19న ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 9: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మాకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ లో భాగంగా సిద్దిపేట జిల్లా యూత్ అండ్ స్పోర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ పర్యవేక్షనలో ఫుట్బాల్ క్రీడాకారుల ఎంపికలు ఈ నెల19 న ఉంటాయిని ఇంచార్జి డి వై ఎస్ ఓ జయదేవ్ ఆర్యా, సిద్దిపేట ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి, కోచ్ అక్బర్ నవాబ్ సోమవారం తెలిపారు. ఫుట్బాల్ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులు తమ ఆధార్ కార్డు, అలాగే 10వ తరగతి నకల్ కాపీ తీసుకొని రావాలని సూచించారు. ఎంపికైన క్రీడాకారులకు వారం రోజుల పాటు ప్రత్యేక కోచింగ్ ఇవ్వబడుతుందని, వారం రోజుల క్యాంప్ తర్వాత ఈ నెల 27 న హైదరాబాద్ లోని జింఖానా స్టేడియం లో జరుగనున్న రాష్ట్ర స్థాయి పోటిల్లో పాల్గొంటారని తెలిపారు.