పెట్రోల్, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ తగ్గించాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని కలెక్టరేట్లో తహసిల్దార్ ఆఫీస్ ల వద్ద సోమవారం నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రకటించారు. కాగా ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం పెట్రోల్ పై రూ. 5, డీజిల్ పై రూ.10 వ్యాట్ తగ్గించడంతో రాష్ట్రం కూడా తగ్గించాలని డిమాండ్ తీవ్రమవుతోంది. అయితే తగ్గింపుపై ఇప్పటివరకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఏలాంటి నిర్ణయం తీసుకోలేదు.