కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రమాదకరం
* ఓట్ల కోసమే “అయోధ్య” రామాలయాన్ని వాడుకుంటున్న మోదీ
* ఎన్నికల కమిషన్ పైన రాజకీయ ఓత్తిడి ఎక్కువైంది
* అందరికీ వడదెబ్బ తగిలితే మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు దెబ్బ
* సిపిఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ
హైదరాబాద్ యదార్థవాది ప్రతినిధి
రాబోయే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ‘అయోధ్య’ రామాలయ అంశాన్ని ప్రధాని మోడీ ఆయుధంగా ఉపయోగించు కుంటున్నారని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. దేశంలో సెంటిమెంట్ వాతావరణం సృష్టించి అయోధ్య రామాలయ దేవాలయం ప్రారంభించి ఓట్లు దండుకునే కార్యక్రమంగా మారుస్తున్నారని తెలిపారు. లోకసభ ఎన్నికల కోసం సిపిఐ శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం కావాలని అందరికీ వడదెబ్బ తగిలితే మాజీ సీఎం కేసీఆర్ కు కూతురు దెబ్బ తగిలి కవిత కోసం బిజెపితో రాజీపడ్డారని విమర్శించారు. హైదరాబాద్ మగ్ధూంభవన్ రెండు రజుల పాటు జరిగే సిపిఐ రాష్ట్ర సమితి సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఎస్.కె.సాబీర్ పాషా అధ్యక్షతన ప్రారంభమైన సమావేశంలో నారాయణతో పాటు సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి హాజరయ్యారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాలనర్సింహ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమావేశం కొద్ది సేపు మౌనం పాటించి నివాళ్లు అర్పించింది. అనంతరం నారాయణ జాతీయ రాజకీయాలపై మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రమాదకారిగా మారిందని సంస్థాగత వ్యవస్థలను నియంత్రిస్తోందని దేశ వ్యాప్తంగా కేంద్రంలోని బిజెపి పాలన పట్ల అన్ని వర్గాలూ వ్యతిరేకంగా ఉన్నాయని ‘ఇండియా’ కూటమికి అనుకూల వాతావరణం ఉన్నదని ఈ విషయాన్ని బిజెపి ఆర్ మేథావులు కూడా గుర్తించారని అందుకే ‘ఇండియా’ అనే పదం వినిపించకుండా ఉండేలా రాజ్యాంగంలోని ఇండియా పదానికి బదులుగా భారత్ పేరును చేర్చారని అన్నారు. ఎన్నికల కమిషన్ పైన అన్ని రాజకీయ ఓత్తిడి మరింత పెరిగిందనితెలిపారు. అద్వానీ గ్రాఫ్ పెరుగుతుందనే ఉద్దేశంతోనే ఆయనను అయోధ్య ప్రారంభోత్సవానికి రానివ్వడం లేదని ఉద్దేశపూర్వకంగా నాటకీయ పరిణామాలతోనే పార్లమెంట్ దాడి జరిగిందని విమర్శించారు. దేశానికి గుండెకాయలాంటి పార్లమెంట్ దాడిజ రిగితే ఇక దేశ పరిస్థితి ఏమిటని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వాన్ని నారాయణ నిలదీశారు. ఒక వేళ నిజమైన బాంబు తీసుకొచ్చి ప్రధాని మీద వేస్తే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. దీనిపైన ప్రధాని ఒక ప్రకటన కూడా చేయలేకపోయారని మండిపడ్డారు.
వైఎస్ షర్మిల ఎపిలోని కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అదే జరిగితే వైసిపి నుండి కొందరు కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశాలు ఉంటాయని అన్నారు. ఏపీ సిఎం జగన్ టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్ ముగ్గురూ భయబ్రాంతులకు గురై మోడీతోనే కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని మోదీ కన్ను తెరిస్తే ఎక్కడ జైలులోఉండాల్సి వస్తుందోనని సిఎం జగన్ ప్రతిపక్షనేత బాబు భయపడుతున్నారని విమర్శించారు.
సిపిఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్ ఫిబ్రవరి 2,3వ తేదీలలో జరగనున్నట్టు నారాయణ తెలిపారు. రాష్ట్రంలోని కొత్తగూడెం ఎంఎల్ స్థానాన్ని సిపిఐ గెలుచుకోవడం పట్ల వివిధ రాష్ట్రా ల నుండి తనకు ఫోన్లు చేసి అభినంధిస్తున్నారని వారు ఎంతో సంతోషపడుతున్నారన్నారు. ప్రజా సమస్యల ప్రస్తావన అంశంలో శాసనసభలో కమ్యూనిస్టు సభ్యుల గొంతు మిగతా సభ్యులకంటే ఎంత భిన్నంగా ఉంటుందో ఇప్పటికే ప్రజలకు అర్థమైందన్నారు. సిపిఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా మాట్లాడుతూ ప్రధాని మోడీకి ప్రజల కంటే ఎవిఎం యంత్రాలపైన నమ్మకం ఎక్కువగా ఉన్నదని అందుకే మరోసారి తామే అధికారంలోనికి వస్తామని ధీమాగా ఉన్నారన్నారు. పారదర్శకంగా వ్యవహారించాల్సిన ఎన్నికల సంఘం కేంద్రంలోని బిజెపికి చెంచగా మారిందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినమూడు చట్టాలు అధ్వాన్నంగా మారాయని దుయ్యబట్టారు. లాటిన్ అమెరికాలో కూడా లెఫ్ట్ సభ్యులే గెలుస్తున్నారన్నారు. కాగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఈ సమావేశంలో కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టారు.