కైకాల సత్యనారాయణ మృతి..
టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. కైకాల మరణం..
హైదరాబాద్ 23 డిసెంబర్ 2022
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్య తో బాధపడుతూ హైదరాబాద్ లోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుది శ్వాస విడిచారు. హీరోగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రధాన విలన్ గా కమెడియన్ గా అన్ని రకాల పాత్రలను పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. సత్యనారాయణ నిర్మాత గా సినిమాలు రూపొందించి ఆయన పోషించిన వైవిధ్యమైన పాత్రలకు గుర్తుగా ఆయన నటనకు సార్వభౌమ అనే బిరుదు పొందారు. కైకాల సత్యనారాయణ తెలుగు సినీ పరిశ్రమలో ఎమ్మెస్ రంగారావు తర్వాత అలాంటి వైవిధ్య పాత్రను పోషించిన వారిలో సత్యనారాయణ ఒకరు. కైకాల సత్యనారాయణ కన్నుమూత తో టాలీవుడ్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అర్పించేందుకు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి తరలివస్తున్నారు.