కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జి సెంటర్ లో రాష్ట్ర స్తాయి వర్క్ షాప్.
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
మిషన్ భగీరథ శాఖ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని కోమటిబండ మిషన్ భగీరథ నాలెడ్జి సెంటర్ లో ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితా సబర్వాల్ మిషన్ భగీరథశాఖ ఆధ్వర్యంలో మిషన్ భగీరథ సిఇలు, ఎస్ఇ లు, ఇఇలు, డిఇలకు రాష్ట్ర స్తాయి వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కార్యదర్శి స్మిత సబర్వాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందించాలే సదాశయంతో చేపట్టిన గొప్ప కార్యక్రమం మిషన్ భగీరథ. వేలాది కోట్ల రూపాయలను వ్యయం చేసి వేలాది కిలోమీటర్ల మెయిన్ వాటర్ పైప్ లైన్లు, OHSR ల నిర్మాణం, ఇంటింటికి నల్లాల బిగింపు పూర్తయి ఇంటింటికి సుఖమైన త్రాగు నీరు అందించబడుతుందని, ప్రభుత్వ ఆశయం మేరకు ఇంటింటికి శుద్ధమైన త్రాగునీరు అందించడంలో మిషన్ భగీరథ అధికారులు, ముందస్తు ప్రణాళిక బద్దంగా పనిచేసి అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి వాటర్ లీకేజీలు కాకుండా సరిచూసుకొని రానున్న వేసవి కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా త్రాగునీటి సమస్య తలెత్తకుండా శుద్ధమైన మిషన్ భగీరథ త్రాగునీరు సరఫరా చెయ్యాలని అన్నారు. వ్యవసాయానికి నీటి ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేసేటప్పుడు మిషన్ భగీరథ ద్వారా త్రాగునీరు సరఫరా చేసేందుకు అవసరమైన నీరు లభ్యమయ్యేలా చూసుకోవాలని, మున్సిపాలిటీలో మరియు గ్రామపంచాయతీలలో స్థానిక సంస్థల అధికారుల సమన్వయంతో త్రాగునీరు సరఫరా చేయాలని తెలిపారు. మిషన్ భగీరథ ఎస్ఇలు, ఇఇలు క్షేత్రస్థాయిలో మిషన్ భగీరథ మెయిన్ గ్రిడ్ మరియు ఇంట్రా విలేజ్ పనులను పరిశీలించి నిర్మాణాలకు కలరింగ్ మరియు మిషన్ భగీరథ పేరుతో సహా వర్క్ వైస్, గ్రిడ్ వైస్ రిపోర్టును మార్చి చివరిలోగా అందించాలని తెలిపారు.
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/31-1-1024x596.jpg)
![](https://yaadharthavaadhi.in/wp-content/uploads/2023/01/30-4-1024x600.jpg)