క్రిస్మస్ పండగ సంతోషం నింపుతుంది.. ఎమ్మెల్యే చల్లా
పరకాల 25 డిసంబర్ 22
పేదలకు సహయం చేయడమే పరమావధిగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని, పేదలు బీఆర్ఎస్ ప్రభుత్వనికి ఆత్మబంధువులని పరకాల శాసన సభ్యులు చల్లా ధర్మారెడ్డి అన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా గీసుగొండ మండల గొర్రెకుంటలోని తెలుగు బాపిస్తు, మంచి కాపరి కాథోలిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతు, యేసుక్రీస్తు జన్మించిన ఈ పర్వ దినమున అందరికీ శాంతి, సౌభాగ్యాలు చేకూరాలని, ప్రతి ఒక్కరి జీవితంలో సంతోషం నింపాలని, ఇంటింటా ఆనందపు కాంతులు వెల్లివిరియాలని యేసు క్రీస్తును ప్రతిస్తూ, ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ రాష్ట్రం వచ్చాక అన్ని మతాలను సమానతో, పండగలను అధికారికంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుంకరి శివ, మండల ముఖ్య నాయకులు, నాయకులు, కార్యకర్తలు, మతపెద్దలు, తదితరులు పాల్గొన్నారు.





