34.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణక్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దే….

క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దే….

క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దే ….

సిద్దిపేట 23 డిసంబర్ 22
క్రైస్తవులను మైనారిటీలుగా గుర్తించిన ఘనత కాంగ్రెస్ దేనని సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు అత్తు ఇమామ్ అన్నారు. గురువారం రాత్రి సిద్దిపేట పట్టణంలోని సీఎస్ఐ చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు అత్తు ఇమామ్ హాజరై, చర్చి ఫాస్టర్ అంటోని లతో కలిసి కేకు కట్ చేశారు. ఈ సందర్భంగా అత్తు ఇమామ్ మాట్లాడుతూ గత కరోనా కాలంలో పండగలు కూడా జరుపుకోలేదని, ఈ ఏడాది క్రిస్మస్ ను క్రైస్తవులంతా ఘనంగా జరుపుకోవాలని కోరారు. మతాలు ఎన్ని అయినా భావం మాత్రం ఒకటేనని, కానీ ఎవరి సంప్రదాయం వారికి ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే క్రైస్తవుల అభివృద్ధి జరిగిందని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు క్రైస్తవులంతా ప్రార్థనలు చేయాలని కోరారు. రాహుల్ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి రాగానే క్రైస్తవుల అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. అధికారం ఉందని అర్థంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నాసిరికమైన బట్టలను అందజేస్తూ టిఆర్ఎస్ ప్రభుత్వం క్రైస్తవులను మోసం చేస్తుందని ఆరోపించారు. అనంతరం ఫాస్టర్ అంటోని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించగా, అత్తు ఇమామ్ ఫాస్టర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సయ్యద్ అతిక్. యూత్ కాంగ్రెస్ జిల్లా జనరల్ సెక్రెటరీ రాజ్వీర్. పట్టణ మైనారిటీ ఉపాధ్యక్షుడు ఫయాజ్ యూత్ కాంగ్రెస్ నాయకులు గయాజుద్దీన్ తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్