25.7 C
Hyderabad
Thursday, March 13, 2025
హోమ్తెలంగాణక్షేత్రస్థాయిలో అధికారులు రైతుల వద్దకు వెళ్ళాలి..

క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల వద్దకు వెళ్ళాలి..

క్షేత్రస్థాయిలో అధికారులు రైతుల వద్దకు వెళ్ళాలి..

-వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా పంటలు వేయాలి..

-అకాల వర్షాలతో నష్ట పోతున్న రైతులను ఆయిల్ ఫాం సాగుకు ప్రోత్సహించాలి..

-జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..

సిద్ధిపేట యదార్థవాది

అయిల్ ఫాం సాగులో వేగం పెంచి ఇచ్చిన లక్ష్యాన్ని చేరేలా పని చెయ్యాలి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్.. జిల్లా సమీకృత కార్యాలయంలో గురువారం వ్యవసాయ, ఉద్యాన వన, అయుల్ ప్రేడ్ కార్పొరేషన్, డ్రిప్ కంపెనీ ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.. జిల్లాలో ఇప్పటివరకు సూమారు 2059 ఎకరాలు సేకరణ 600 ఎకరాల పైన మొక్కలు పెట్టడం పూర్తి చేశారని జిల్లా ఉద్యాన వన శాఖ అధికారి సునితా కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యంత లాభదాయకమైన పంట అయుల్ ఫాం సాగు జిల్లాలో వేగం పెంచాలని, వర్షాకాలం ప్రారంభమైనందున రైతులు పంటలు వేసెలోపు వారితో మాట్లాడి ఆయిల్ ఫాం సాగు చేసేలా ప్రేరెపించాలని, ఈ నెలలోనే మనం పెట్టుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలని, ఏఈఓ లు ప్రతి రైతు వద్దకు వెళ్ళి ఆయిల్ పాం వల్ల కలిగే లాభాలు తెలుపి ప్రేరణ కల్పించాలని గ్రామాల్లో అయిల్ ఫాం సాగును పెద్ద ఎత్తున ప్రచారం చెయ్యాలని అయిల్ ఫాం సాగుకు రైతులతో డిడి కట్టించడమే కాకుండా ప్లాంటేషన్ జరగాలి రోజు పిల్డు మీదికి వెళ్లి తెలుసుకోవాలని డిఎఓ కి తెలిపారు. ఏఓ లు వారి మండలాలోని పనిలో వెనకబడిన క్లస్టర్ల ను రోజువారీ పర్యవేక్షణ చెయ్యాలని, వాతావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయిల్ ఫాం సాగు వల్ల వచ్చే లాభాలను తెలుపుతూ రైతులను ప్రోత్సహించాలని అన్నారు. వ్యవసాయ, ఉద్యాన వన శాఖ, ఆయిల్ ప్రేడ్ కార్పొరేషన్ అధికారులు సమన్వయంతో పని చేయ్యాలని తెలిపారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్, ఆయిల్ ప్రేడ్ కార్పొరేషన్ మెనెజర్ సురేందర్ రెడ్డి, కార్పొరేషన్ ఇంచార్జి సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్