గడప గడపకు మన ప్రభుత్వం
యదార్థవాది ప్రతినిధి కొవ్వూరు
కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం నెలటూరు గ్రామంలో 84 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోం మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డా.తానేటి వనిత పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని డ్వాక్రా మహిళలతో హోంమంత్రి సమావేశమయ్యారు. గత టీడీపీ పాలకులు డ్వాక్రా రుణాలను మాఫీ చేయకుండా మహిళలను మోసం చేశారు. దీని వలన డ్వాక్రా గ్రూపులు నిర్వీర్యం అయ్యాయని హోంమంత్రి గుర్తుచేశారు. సీఎం జగన్ ఆధికారంలోకి వచ్చాక డ్వాక్రా రుణాలను విడతల వారిగా మాఫీ చేస్తున్నారని తెలిపారు. అనంతరం నెలటూరు గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి లబ్ధిదారులకు వివరించారు. అమ్మవడి, విద్యాకానుక, వసతి దీవెన, ఆసరా, చేయూత, రైతు భరోసా, పేదలకు ఇళ్ల స్థలాలు వంటి అనేక సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజల జీవితాలలో వెలుగులు నింపాయన్నారు. ప్రజా సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు.