ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు
నిజామాబాద్ యదార్థవాది ప్రతినిది
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ శాఖ ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు పురస్కరించుకొని అయన చిత్రపటానికి మిఠాయిలు పంచుతూ వేడుకలను నిర్వహించిన జిల్లా అధికార ప్రతినిధి అనిల్ కుమార్. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ 73వ జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ నరేంద్ర మోడీ ఆయురారోగ్యాలతో రాబోయే కాలంలో మళ్ళీ భారత ప్రధానిగా నియమక్కమై దేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం నుండి అభివృద్ధి చెందిన దేశంగా మార్చి ప్రతి వ్యక్తికి భారత ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు అదేవిధంగా కృషి చేయాలని ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందే ప్రపంచంలోనే అగ్రగామిగా ఎదగాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి నరేంద్ర మోడీ ని అనుకోవాలని ఈ దేశాన్ని సనాతన ధర్మాన్ని రక్షించవలసిన అవసరం ఎంతో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రంగారెడ్డి, జిల్లా నాయకులు, బిఎంఎస్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.