ఘనంగా భారత తొలి పాత్రికేయులు రామానంద చటర్జీ వర్ధంతి వేడుకలు..
మెదక్ యదార్థవాది
రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ కౌడిపల్లి వారి ఆధ్వర్యంలో భారతదేశపు తొలి పాత్రికేయులు రామానంద చటర్జీ 80వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ కౌడిపల్లి మండలం కేంద్రంలో రామనంద చటర్జీ పేరుతో నూతనంగా ఏర్పడిన ప్రెస్ క్లబ్ భవనంలో అధ్యక్షుడు నాగరాజు చారి ఆధ్వర్యంలో రామానంద చటర్జీ 80 వర్ధంతి నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం రామానంద చటర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. చటర్జీ వర్జంతి సందర్భంగా జర్నలిస్టులు రెండు నిమిషాలు మౌనం పాటించి మాట్లాడుతూ రామానంద చటర్జీ పేరుతో కౌడిపల్లి లో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరమైన విషయం అని రామానంద చటర్జీ దేశంలోనే మొట్టమొదటి పాత్రికేయులు అని దేశానికి ఎన్నో సేవలు చేశారని కొనియాడారు. చాటర్జీ బడుగు బలహీన పేద ప్రజల సమస్యలను అధికారులకు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్ళే వారని మనం కూడా కౌడిపల్లి రామానంద చటర్జీ ప్రెస్ క్లబ్ పేరును నిలబెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. కార్యక్రమంలో కౌడిపల్లి జర్నలిస్టులు భరత్ గౌడ్, నాగరాజు, సత్యానందం, రాజు, సైపోద్దీన్, సత్య గౌడ్,శ్రీకాంత్, రవికుమార్ గౌడ్, గోవర్ధన్ రెడ్డి, అతిథులుగా కౌడిపల్లి యువసేన అధ్యక్షులు పోల నవీన్, సభ్యులు రాజశేఖర్, రాజు,సందీప్, తదితరులు పాల్గొన్నారు.