ఘనంగా మొదలైన సంక్రాంతి సంబరాలు..
తిరుపతి: యదార్థవాది ప్రతినిది
తిరుపతి జిల్లా పోలీస్ పేరెడ్ మైదానంలో పోలిస్ శాఖ ఆధ్వర్యంలో బుదవారం ఘనంగా మొదలైన సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి రోజా, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, జ్యోతి ప్రజ్వలన చేసి సంక్రాంతి సంబరాలను పోలీస్ కుటుంబ సభ్యులతో మొదలుపెట్టారు.. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ముందుగ క్రీడా మైదానంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, పోలీసు వ్యవస్థ నిత్యం శాంతిభద్రతలలో తల మునకలై ఉంటారని, ఈ సంక్రాంతి సంబరాలు ఆటవిడుపుగా ఉంటుందని పోలీస్ అధికారులకు కుటుంబ సభ్యులకు, ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సిరిసంపదలతో ఉండాలని తెలిపారు. ఈ సంక్రాంతి సంబరాల్లో భాగంగా మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషుల విభాగంలో కబడ్డీ పోటీలు నిర్వహించి, విజేతలుగా నిలిచిన వారికి బహుమతి ప్రధానం చేశారు..