27.2 C
Hyderabad
Thursday, February 6, 2025
హోమ్తెలంగాణఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఘనంగా శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి

ఆర్మూర్ యదార్థవాది

భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ 70వ వర్ధంతిని పురస్కరించుకొని వారి యొక్క వర్ధంతిని “బలిదాన్ దివస్” గా నిర్వహిస్తూ ఆర్మూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు..ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి మాట్లాడుతూ డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఈ దేశానికి మొట్టమొదటి పరిశ్రమల మరియు సరఫరాల మంత్రిగా నెహ్రూ యొక్క మంత్రివర్గంలో పని చేయడం జరిగిందని, కొంతకాలానికి నెహ్రూ యొక్క విధానాలు నచ్చక భారతీయ జన సంఘ్ పార్టీని స్థాపించి ఈ దేశం ధర్మం రక్షించబడాలని, మైనారిటీ ఓట్ల కోసం ముస్లిం సంతుస్టీకరణ విధానం సరైంది కాదని, ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమని. కాశ్మీర్లో ఉన్నటువంటి 370 ఆర్టికల్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ “ఏక్ దేశమే దో విధాన్ – దో ప్రధాన్ ఔర్ దో నిషాన్ నహి చలేగా — నహి చలేగా” (ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానుల రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదు – ఉండకూడదు) అని నినదించిన ఒక ప్రఖండ దేశభక్తుడని, రాజీలేని పోరాటం చేస్తూ 1953లో కాశ్మీర్ కు వెళ్లి ఆర్టికల్ 370 ను రద్దు చేయాలని ధర్నా చేస్తే అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అతనిని అరెస్టు చేసిందని అన్నారు. జూన్ 23న కారాగారంలో మరణించినట్లుగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిందని, కాని శ్యామ ప్రసాద్ ముఖర్జీ మరణం అనుమానాస్పదం కావడంతో దీనిపైన విచారణ చేయాలని అప్పటి జనసంఘ్ నాయకులు డిమాండ్ చేసినా నెహ్రూ ప్రభుత్వం పట్టించుకోలేదని తెలిపారు. శ్యామ ప్రసాద్ ముఖర్జీ ఆదర్శాలను ఆలోచనలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 370 ఆర్టికల్ ను రద్దుచేయడమే కాకుండా ఈ దేశాభివృద్ధికై భారత ప్రధాని శ్యామ ప్రసాద్ ముఖర్జీ యొక్క ఆలోచనలను, ఆదర్శాలను ముందుకు తిసుకేల్తున్నారని అయన అన్నారు.. కార్యక్రమంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెట్టి గంగాధర్, బిజెపి సీనియర్ నాయకులు బొట్ల విజయ్, బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు పోల్కం వేణు, విజయానంద్, బిజెపి ఆర్మూర్ పట్టణ ఉపాధ్యక్షులు మీసాల రాజేశ్వర్, గిరిజన మోర్చ మాజీ జిల్లా అధ్యక్షులు కొర్ర గంగాధర్, బిజెపి ఆర్మూర్ పట్టణ కార్యదర్శులు ఖాందేశ్ ప్రశాంత్, పులి యుగంధర్, కేలోత్ పీర్ సింగ్, మిర్యాల్కర్ కిరణ్, సుంకరి రమణ బారడ్ వినోద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్