27.2 C
Hyderabad
Wednesday, February 5, 2025
హోమ్తెలంగాణజిల్లాలో అథ్లెటిక్స్ క్రీడలు ప్రారంభం..

జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడలు ప్రారంభం..

జిల్లాలో అథ్లెటిక్స్ క్రీడలు ప్రారంభం..

సిద్దిపేట: 11 యదార్థవాది ప్రతినిది

సిద్దిపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో అథ్లెటిక్స్ క్రీడలను ప్రారంభించిన అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్ మహేందర్.. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ స్వామి వివేకానంద జయంతి పురస్కరించు కొని సిద్దిపేట పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడోత్సవాలు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ 100, 400, 800 ల మీటర్ల రన్నింగ్ హాయ్ జిమ్ లాంగ్ జంప్ సిద్దిపేట జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్ బుధవారం నిర్వహించామన్నరు. జిల్లా నలుమూలల నుండి మహిళలు 48, పురుషులు 89 పాల్గొన్నారని తెలిపారు. జాతీయ యువజన దినోత్సవం రోజున క్రీడాకారులైన యువతను ప్రోత్సహించామని, యువ క్రీడాకారులకు గురువారం బహుమతులను జిల్లా పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీ టీచర్స్ రామేశ్వర్ రెడ్డి, లక్ష్మణరావు, శ్రీనివాసులు, ఉప్పలయ్య మహిళా పీఈటి టీచర్స్ రజిత, సుశీల సిద్దిపేట ట్రాఫిక్ ఏసిపి ఫణిందర్, సిసిఆర్పి, ఏసిపి చంద్రశేఖర్, ఆర్ ఐ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్